యాప్నగరం

కోహ్లీ 10ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్.. శుభమన్ గిల్ టాప్

దేవధర్ ట్రోఫీ ఫైనల్లో శుభమన్ గిల్ ఒక్క పరుగు వద్దే వికెట్ చేజార్చుకున్నా.. కెప్టెన్‌గా 10 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డ్‌ని బద్దలు కొట్టాడు. భారత తుది జట్టులో చోటు కోసం గిల్ నిరీక్షిస్తున్నాడు.

Samayam Telugu 4 Nov 2019, 4:23 pm
భారత టెస్టు జట్టులోకి ఇటీవల ఎంపికైన యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కి దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మాత్రం తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే.. తాజాగా దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న గిల్ 10 ఏళ్ల నాటి విరాట్ కోహ్లీ రికార్డ్‌ని బద్దలు కొట్టాడు.
Samayam Telugu Virat Kohli, Shubman Gill


దేవధర్ ట్రోఫీ 2019-20లో భాగంగా రాంచీలో భారత్ - బి, భారత్- సి జట్లు ఈరోజు ఫైనల్లో తలపడ్డాయి. సి జట్టుకి కెప్టెన్‌గా ఉన్న శుభమన్ గిల్ ఒక్క పరుగుకే ఔటైనా.. దేవధర్ ట్రోఫీ ఫైనల్‌లో జట్టుకి కెప్టెన్సీ వహించిన పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 10 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డ్ బద్దలైంది.

విరాట్ కోహ్లీ 2009-10 సీజన్‌లో 21 ఏళ్ల 142 రోజుల వయసులో నార్త్ జోన్ టీమ్‌ని కెప్టెన్‌గా నడిపించాడు. తాజాగా శుభమన్ గిల్ 20 ఏళ్ల 57 రోజుల వయసులోనే ఇండియా- సి జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించి ఆ రికార్డ్‌ని కనుమరుగు చేశాడు.

దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌ కోసం ఓపెనర్‌గా శుభమన్ గిల్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. ఫస్ట్ టెస్టు నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ శతకాల మోత మోగించడంతో అతనికి కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.