యాప్నగరం

ఫెయిలవుతున్నా.. ధావన్‌ ఆటలో మార్పేది..?

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నా.. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆటతీరుని మార్చుకోవడం లేదని దిగ్గజ క్రికెటర్

Samayam Telugu 7 Aug 2018, 2:37 pm
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నా.. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆటతీరుని మార్చుకోవడం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శించాడు. బర్మింగ్‌హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఫెయిలైన ధావన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 26, 13 పరుగులే చేశాడు. జట్టులో కోహ్లి మినహా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమైనప్పటికీ.. ధావన్ తరహాలో ఎవరూ వికెట్ సమర్పించుకోలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతిని ధావన్ వెంటాడుతూ స్లిప్‌లో ఫీల్డర్ చేతికి చిక్కాడు. ఈ టెస్టుకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌.. రెండు ఇన్నింగ్స్‌లోనూ అతను డకౌటయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి జరగనుంది.
Samayam Telugu shikhar-dhawan-759


రెండో టెస్టు నేపథ్యంలో.. ధావన్‌ ఆటతీరు గురించి గవాస్కర్ మాట్లాడాడు. ‘వైఫల్యాలు ఎదురవుతున్నా.. శిఖర్ ధావన్ తన ఆటతీరుని మార్చుకోవడం లేదు. వన్డే, టీ20 తరహాలో ఆడినట్లే.. టెస్టుల్లోనూ అతను షాట్స్ ఆడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే.. టెస్టులు చాలా భిన్నమనే విషయాన్ని అతను గ్రహించాలి. వన్డే, టీ20ల్లో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతుల్ని ఫుష్ చేస్తే అవి స్లిప్‌లో బౌండరీకి వెళ్తాయి. కానీ.. టెస్టుల్లో అలా వెళ్లే బంతుల్ని ఫుష్ చేస్తే అవి నేరుగా స్లిప్‌లోని ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్తాయి. కాబట్టి.. ఆ షాట్స్‌‌ని ఆడకుండా ధావన్ తనని తాను నియంత్రించుకోవాలి. అలా కంట్రోల్ చేసుకోలేకపోతే.. విదేశీ గడ్డపై టెస్టుల్లో అతని వైఫల్యాల పరంపర కొనసాగుతుంది’ అని ఈ దిగ్గజ క్రికెటర్ హెచ్చరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.