యాప్నగరం

ఆ ఆలోచన వస్తే.. ధోనీ‌ని అడ్డుకునేదెవరు..?

టీమిండియాకి ఇక తాను ఉపయోగపడనని మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భావిస్తే.. వెంటనే జట్టు నుంచి వైదొలుగుతాడని

TNN 13 Aug 2017, 4:20 pm
టీమిండియాకి ఇక తాను ఉపయోగపడనని మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భావిస్తే.. వెంటనే జట్టు నుంచి వైదొలుగుతాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. అయితే.. అప్పటి వరకు ధోనీకి స్వేచ్ఛ ఇవ్వాలని అతని కెరీర్‌పై అతనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలని సూచించాడు. ప్రస్తుతం మంచి ఫిటెనెస్ ఉన్న క్రికెటర్లలో ధోనీ ఒకడని కితాబిచ్చాడు. ధోనీతో కలిసి మీరు ఐపీఎల్‌లో ఆడారు.. అతను 2019 ప్రపంచకప్ ఆడతారంటారా..? అని ప్రశ్నించగా.. హస్సీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
Samayam Telugu dhoni deserves to go out on his own terms hussey
ఆ ఆలోచన వస్తే.. ధోనీ‌ని అడ్డుకునేదెవరు..?


‘ధోనీ వీడ్కోలు నిర్ణయాన్ని అతనికే వదిలేయాలి. అతను ఒకవేళ 2019 ప్రపంచకప్ ఆడాలనుకుంటే అతడిని అడ్డుకునేదెవరు..? అతను చాలా పరిణతితో ఆలోచించే వ్యక్తి. నిజాయితీపరుడు. నిజంగా ప్రపంచకప్‌లో భారత్ జట్టుకి తాను సాయపడలేనని భావిస్తే అతను జట్టుతో ఉంటాడని నేను అనుకోను. ప్రస్తుతం 36ఏళ్ల వయసులోనూ ధోనీ మంచి ఫిటెనెస్‌తో ఉన్నాడు. ఎప్పుడు ఆటకి గుడ్‌బై చెప్పాలో అతనికి బాగా తెలుసు’ అని హస్సీ వివరించాడు. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున మైకేల్ హస్సీ ఆడాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.