యాప్నగరం

​ ధోనీ.. నువ్వు ఆడుతూనే ఉంటావా..?

ధోనీ రాకతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ కెరీర్‌‌ చాలా కోల్పోయాడు. ఒకవేళ అతనికి అవకాశం ఇచ్చుంటే..

TNN 21 Aug 2017, 6:25 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2019 ప్రపంచకప్ జట్టులో ఉంటాడనే సెలక్టర్ల సంకేతాలపై వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. ఫామ్, ఫిటెనెస్ లేకపోవడంతో ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్, సురేశ్ రైనాలపై సెలక్టర్లు వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే.. గత కొంతకాలంగా ఫామ్‌లోలేని ధోనీని ఎందుకు ఎంపిక చేసినట్లని.. ప్రపంచకప్ వరకూ అతను ఫామ్‌ కోల్పోకుండా అలానే ఉండగలడా..? అని గంభీర్ ప్రశ్నించాడు.
Samayam Telugu dhoni must perform to play till 2019 world cup
​ ధోనీ.. నువ్వు ఆడుతూనే ఉంటావా..?


‘2019 ప్రపంచకప్ జట్టులో ఉండాలంటే ధోనీకి ఒకటే దారి.. అప్పటి వరకు అతను ఫామ్‌ కొనసాగించడమే. ఇదే ప్రామాణికాన్ని ఆటగాళ్లందరికీ పాటించాలి. అది ధోనీగానీ.. లేదా ఇంకెవరైనాగానీ. ఒకప్పుడు భారత్ జట్టుకి చాలానే చేశారు. కానీ.. అది గతం.. అయిపోయింది. ఇంకా.. గతాన్ని చూపి.. నాకు ఇష్టమైన రోజులు ఆడతానంటే ఎలా..? అలా అనుకుంటే.. ధోనీ రాకతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ కెరీర్‌‌ చాలా కోల్పోయాడు. ఒకవేళ అతనికి అవకాశం ఇచ్చుంటే.. అతనూ నిరూపించుకునేవాడే. ఇప్పటికీ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టుతో కొనసాగేవాడు’ అని గంభీర్ ఘాటుగా స్పందించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.