యాప్నగరం

ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పునకి కారణమిదే..!

ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఈ ఏడాది పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనాల్ని అందుకుంటూ మూడోసారి టైటిల్‌ని

Samayam Telugu 12 Jun 2018, 12:41 pm
ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఈ ఏడాది పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనాల్ని అందుకుంటూ మూడోసారి టైటిల్‌ని ఎగరేసుకుపోయింది. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటింగ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ 200+ లక్ష్యాలను సైతం చెన్నై ఛేదించేసింది. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ని బలోపేతం చేయడంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తాజాగా వెల్లడించాడు. సాధారణంగా టీ20ల్లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ధోనీ.. ఐపీఎల్ 2018 సీజన్‌లో మాత్రం టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి జట్టు విజయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాడు.
Samayam Telugu dhoni reveals motive behind batting higher in the order in the ipl
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పునకి కారణమిదే..!


‘చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించేందుకు ఎక్కువ బ్యాటింగ్ బాధ్యత తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తే ఆ అవకాశం నాకు తక్కువ దొరుకుతుంది. అందుకే.. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తానని జట్టు సమావేశంలో వెల్లడించాను. దీనికి అనుగుణంగా మ్యాచ్‌లో మిగిలి ఉన్న ఓవర్లు బట్టి 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కి దిగాను. ఒకవేళ నేను తొందరగా ఔటైనా.. మిగిలిన వాళ్లకి మ్యాచ్‌ ఫినిష్ చేసే అవకాశం దొరుకుతుందని నా ఆలోచన. టోర్నీలో ఓపెనర్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, డ్వేన్ బ్రావో మెరుగ్గా ఆడటంతో తుది జట్టులో ఎక్కువగా మార్పులు చేయాల్సిన అవసరం లేకపోయింది’ అని ధోనీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.