యాప్నగరం

ధావన్ గిఫ్ట్.. లంక తరఫున పెరీరా రికార్డ్

చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను ధావన్ గిఫ్ట్‌గా ఇవ్వడంతో లంక బ ౌలర్ దిల్‌రువాన్ పెరీరా రికార్డ్ నెలకొల్పాడు.

TNN 2 Dec 2017, 11:12 am
ఢిల్లీ వేదికగా జరుగుతోన్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ను భారత జట్టు ధాటిగా ఆరంభించింది. పది ఓవర్లలో ఓపెనర్లు విజయ్, ధావన్ తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. దిల్ రువాన్ పెరీరా వేసిన పదో ఓవర్ చివరి బంతిని నిర్లక్ష్యంగా ఆడిన ధావన్ చేజేతులా వికెట్ సమర్పించుకున్నాడు. శిఖర్ ధావన్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ బాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్‌లో లక్మల్ చక్కగా అందుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నా.. బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్‌ను తాకడంతో ధావన్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
Samayam Telugu dilruwan perera 100 wkts in 25 tests the quickest by a sri lankan test bowler
ధావన్ గిఫ్ట్.. లంక తరఫున పెరీరా రికార్డ్


ధానవ్ తన వికెట్‌ను దిల్ రవాన్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడంతో... టెస్టుల్లో అతడు వంద వికెట్లు పడగొట్టాడు. 25 టెస్టుల్లోనే 100 వికెట్లు తీసిన తొలి శ్రీలంక బౌలర్‌గా పెరీరా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు మురళీధరన్ ముత్తయ్య పేరిట ఉండేది. మురళీధరన్ 27 టెస్టుల్లో ఈ పీట్ సాధించాడు. తర్వాతి స్థానంలో హెరాత్ (29 టెస్టులు) ఉన్నాడు.

21 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. బౌండరీతో ఖాతా తెరిచిన మురళీ విజయ్ 30 పరుగులతో, కెప్టెన్ కోహ్లి 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఛటేశ్వర్ పుజారా గామేజ్ బౌలింగ్‌లో సమరవిక్రమకు క్యాచ్ ఇచ్చి 23 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.