యాప్నగరం

టీమ్‌కి భారమనుకుంటే రిటైర్మెంట్: కార్తీక్

దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు టీమ్‌కి ఆడటాన్ని నేను చాలా ఆస్వాదిస్తాను. ఇంకా చెప్పాలంటే.. సొంత రాష్ట్రానికి ఆడుతున్నప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. -దినేశ్ కార్తీక్

Samayam Telugu 5 Dec 2018, 8:13 pm
భారత్ జట్టులోకి పునరాగమనం తర్వాత దినేశ్ కార్తీక్ అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. వన్డే, టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న ఈ వికెట్ కీపర్.. ఇటీవల టెస్టుల్లో మాత్రం కాస్త తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అంబటి రాయుడి తరహాలో.. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి.. వన్డే, టీ20లపై దృష్టి సారించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే.. తనకి అలాంటి ఆలోచనలేదని తాజాగా చెప్పుకొచ్చిన దినేశ్ కార్తీక్.. జట్టుకి భారమైనప్పుడు కచ్చితంగా వైదొలుగుతానని స్పష్టం చేశాడు.
Samayam Telugu f05dd28230d6f0a17c20d93198c14007


‘దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు టీమ్‌కి ఆడటాన్ని నేను చాలా ఆస్వాదిస్తాను. ఇంకా చెప్పాలంటే.. సొంత రాష్ట్రానికి ఆడుతున్నప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఫస్ట్‌క్లాస్‌ ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనైతే లేదు. కానీ.. ఒకవేళ తమిళనాడు జట్టుకి నేను భారంగా మారినట్లు అనిపిస్తే మాత్రం.. కచ్చితంగా నిర్ణయం తీసుకుంటా. సుదీర్ఘకాలంగా ఆ జట్టుకి ఒక రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించాలనే కోరికతో ఆడుతున్నా. కానీ.. ఇప్పటికీ ఆ కల నెరవేరలేదు’ అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.