యాప్నగరం

పాండ్యా కంటే ధోనీనే వెయ్యి రెట్లు బెటర్..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో.. నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని పోల్చుతుండటంపై భారత మాజీ క్రికెటర్

TNN 7 Oct 2017, 3:38 pm
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో.. నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని పోల్చుతుండటంపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రి అసహనం వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో హార్దిక్ కొన్ని మ్యాచ్‌ల్ని ముగిస్తుండొచ్చు.. కానీ.. అతను ప్రస్తుతం ధోనీతో పోల్చదగిన మ్యాచ్ ఫినిషర్ మాత్రం కాదని ఈ మాజీ క్రికెటర్ వివరించాడు. ధోనీ చేసిన పరుగులు, అనుభవానికి యువ ఆల్‌రౌండర్ ఇంకా చాలా దూరంలో ఉన్నాడని గుర్తు చేశాడు. రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో శనివారం రాత్రి 7 గంటలకి భారత్ తొలి టీ20లో ఢీకొననుంది.
Samayam Telugu do not compare ms dhoni with hardik pandya says karsan ghavri
పాండ్యా కంటే ధోనీనే వెయ్యి రెట్లు బెటర్..!


‘దయచేసి మహేంద్రసింగ్ ధోనీతో హార్దిక్ పాండ్యాని పోల్చిచూడకండి. అతనికి మంచి భవిష్యత్ ఉంది. ప్రస్తుతానికి హార్దిక్ ఇంకా భారత్ జట్టులో తానేంటో నిరూపించుకునే దశలోనే ఉన్నాడు. కానీ.. ధోనీ అలా కాదు. అతను ఇప్పటికే గత కొన్నేళ్లుగా జట్టులో తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు మ్యాచ్‌లు ఫినిష్ చేయడంలో ధోనీకి ప్రత్యేకంగా పోటీలు పెట్టాల్సిన అవసరం లేదు. హార్దిక్ కంటే ధోనీ వెయ్యి రెట్లు బెటర్. ఈ రోజుకి కూడా కేవలం నాలుగైదు ఓవర్లలోనే ధోనీ మ్యాచ్‌ని సమూలంగా మార్చేగలడు. ఆ పవర్ అతనికి ఉంది’ అని కర్సన్ ఘావ్రి వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.