యాప్నగరం

అఫ్గాన్లకి స్పిన్ పిచ్ ఇస్తే.. భారత్‌కి తిప్పలే

బెంగళూరు వేదికగా జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కి స్పిన్‌ పిచ్ ఇవ్వకుండా టీమిండియా జాగ్రత్తపడాలని భారత మాజీ

Samayam Telugu 7 Jun 2018, 12:09 pm
బెంగళూరు వేదికగా జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కి స్పిన్‌ పిచ్ ఇవ్వకుండా టీమిండియా జాగ్రత్తపడాలని భారత మాజీ ఓపెనర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ సూచించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌తో పాటు.. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యుత్తమంగా రాణించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో మొత్తం 21 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో 3/13, రెండో టీ20లోనూ 4/12తో చెలరేగాడు. రషీద్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లి ఆడాలనుకుంటే.. అతనికి దొరికిపోతారని.. హిట్టింగ్‌కి ప్రయత్నించకుండా ఫ్రంట్‌ఫుట్‌పైకి వెళ్లి సింగిల్‌తో సరిపెట్టుకుంటే మంచిదని అఫ్గానిస్థాన్‌ జట్టుకి ఏడాది క్రితం కోచ్‌గా పనిచేసిన రాజ్‌పుత్ వివరించాడు.
Samayam Telugu dont give afghanistan turning track for india test lalchand rajput
అఫ్గాన్లకి స్పిన్ పిచ్ ఇస్తే.. భారత్‌కి తిప్పలే


‘టర్నింగ్ పిచ్‌లపై రషీద్ ఖాన్ చాలా ప్రమాదకరం. ఒకవేళ బెంగళూరు టెస్టులో అలాంటి పిచ్‌ అతనికి దొరికితే.. భారత్‌ బ్యాట్స్‌మెన్‌కి తిప్పలు తప్పవు. ఆ జట్టులో ముగ్గురు మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు. అలాకాకుండా ఫాస్ట్ బౌలర్లకి అనుకూలించే పిచ్ తయారుచేస్తే.. అఫ్గానిస్థాన్‌ జట్టు బలహీనపడుతుంది. ఆ జట్టులో చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు లేరు. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ని ముగించగల పేసర్లు భారత జట్టులో పుష్కలంగా ఉన్నారు’ అని లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించాడు. 2016 నుంచి 2017 వరకు అఫ్గానిస్థాన్‌ జట్టుకి ప్రధాన కోచ్‌గా పనిచేసిన రాజ్‌పుత్ ప్రస్తుతం జింబాబ్వే కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్‌కి ఇదే తొలి టెస్టు మ్యాచ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.