యాప్నగరం

భారత్‌తో టీ20 సిరీస్: కెప్టెన్‌గా డుమిని, విధ్వంసకర హిట్టర్‌కు చోటు

భారత్ జరగనున్న టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా జేపీ డుమిని వ్యవహరించనున్నాడు.

TNN 13 Feb 2018, 5:36 pm
భారత్‌‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా జేపీ డుమిని ఎంపికయ్యాడు. చేతి వేలి గాయం కారణంగా వన్డేలకు దూరమైన డుప్లెసిస్ టీ20లకు కూడా దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో డుమిని నాయకత్వ బాధ్యతలను చేపట్టనున్నాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. మూడు టీ20ల సిరీస్‌ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా బోర్డు 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.
Samayam Telugu duminy to lead south africa in t20i series against india
భారత్‌తో టీ20 సిరీస్: కెప్టెన్‌గా డుమిని, విధ్వంసకర హిట్టర్‌కు చోటు


నాలుగో వన్డేలో మెరుపు బ్యాటింగ్ చేసిన హెన్రిక్ క్లేసన్‌కు టీ20ల్లో చోటు దక్కింది. రామ్ స్లామ్ టీ20 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన క్రిస్టియాన్ జోన్కర్‌ను కూడా భారత్‌తో పోరుకు ఎంపిక చేసింది. దేశవాళీ టీ20 క్రికెట్లో జోన్కర్ ఇటీవల విధ్వంసం సృష్టించాడు. ఇతడితోపాటు జూనియర్ డలా, రీజా హెండ్రిక్స్‌లకు కూడా సఫారీ జట్టులో చోటు దక్కింది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని హషీమ్ ఆమ్లా, మర్కరమ్‌లకు విశ్రాంతి ఇచ్చిన సెలెక్టర్లు.. ఇమ్రాన్ తాహిర్‌కు రెస్ట్ ఇచ్చారు. అతడి స్థానంలో తరాబిజ్ షంసీ, ఆరోన్ ఫంగిసో లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. టెస్టు సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్ తొలి వన్డేలో గాయపడి మిగతా సిరీస్‌కు దూరం కాగా.. ఐదు వన్డేలకు మర్కరమ్‌ను సెలక్టర్లు కెప్టెన్‌గా వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.