యాప్నగరం

రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో.. ఐపీఎల్ ఆడతాడా?

కరేబియన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Samayam Telugu 25 Oct 2018, 10:41 am
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల బ్రావో 2016 సెప్టెంబర్లో చివరిసారిగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రావో.. 270 మ్యాచ్‌ల్లో విండీస్ తరఫున బరిలో దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్టు బ్రావో ప్రకటించాడు. కానీ ఐపీఎల్ లాంటి లీగ్ మ్యాచ్‌ల్లో అతడు కొనసాగే అవకాశాలున్నాయి.
Samayam Telugu bravo2


‘14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. నాకు ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తున్నాయి. 2004లో ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్నాన’ని బ్రావో తెలిపాడు.

బ్రావో గణాంకాలు:
40 టెస్టులు ఆడిన బ్రావో 31.43 సగటుతో 2200 పరుగులు చేయడంతోపాటు 86 వికెట్లు తీశాడు. 164 వన్డేలు ఆడిన ఈ కరేబియన్ ప్లేయర్ 2968 రన్స్ చేయడంతోపాటు 199 వికెట్లు పడగొట్టాడు. 66 టీ20ల్లో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు. చివరిసారిగా 2010లో శ్రీలంకపై చివరి టెస్ట్ ఆడాడు. 2014లో భారత్‌పై ఆఖరి వన్డే ఆడిన బ్రావో.. 2016లో పాక్‌పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.