యాప్నగరం

మ్యాచ్ ముందురోజు స్డేడియం పేరు మార్పు.. విమర్శలు

స్టేడియం పేరు మార్పు ప్రతిపాదనలను గవర్నర్‌కు అందజేయగా పేరు మార్పునకు అంగీకరించారని అధికారులు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Samayam Telugu 6 Nov 2018, 5:53 pm
టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మంగళవారం (నవంబర్ 6న) రాత్రి 7 గంటలకు రెండో టీ20 ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌కు ముందురోజు అంటే.. నవంబర్ 5న సాయంత్రం స్టేడియం పేరు మార్చేయడం వివాదాస్పదమైంది. యూపీలోని లక్నోలో ఇటీవల నిర్మించిన స్టేడియానికి ఎకానా అంతర్జాతీయ స్డేడియంగా నామకరణం చేశారు.
Samayam Telugu Ekana Stadium


భారత్, విండీస్ రెండో టీ20లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. ఎకానా స్టేడియం పేరును దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరుమీదుగా ‘భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియం’గా మార్చేశారు. స్టేడియం పేరును మార్చేస్తున్నట్లు రాష్ట్ర గృహ, పట్టణ విభాగం సోమవారం సాయంత్రం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.

ఆర్టికల్‌ 17.5.1 ప్రకారం.. స్టేడియం పేరు మార్పు ప్రతిపాదనలను గవర్నర్‌కు అందజేయగా పేరు మార్పునకు అంగీకరించారని అధికారులు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కాగా, గోమతి నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ సెక్టార్‌ 7లో నిర్మించిన నూతన స్డేడియాన్ని ముఖ్యమంత్రి యోగి నేడు ప్రారంభించారు. యోగి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయకపోయినా.. నగరాలు, ఏరియాలు, స్డేడియాల పేర్లను మాత్రమే మారుస్తుందంటూ ఎస్పీ అధికార ప్రతినిధి సునిల్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.