యాప్నగరం

తొలి టీ20లో రూల్స్ బ్రేక్ చేసిన పాక్ బౌలర్.. పట్టించుకోని అంపైర్లు

కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. బంతిపై ఉమ్ము రుద్దే తన సహజ అలవాటుని మార్చుకోలేకపోయాడు. అతను రూల్స్ బ్రేక్ చేసినా ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు.

Samayam Telugu 29 Aug 2020, 8:47 am
ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ రూల్స్ బ్రేక్ చేశాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ మధ్యలోనే రద్దవగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 16.1 ఓవర్లు ముగిసే సమయానికి 131/6తో నిలిచింది. ఆ జట్టులో ఓపెనర్ టామ్ బాంటన్ (71: 42 బంతుల్లో 4x4, 5x6) మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. కానీ.. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పదే పదే ఐసీసీ రూల్స్‌ బ్రేక్ చేస్తూ కనిపించాడు. అయినప్పటికీ.. ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు.
Samayam Telugu Mohammad Amir (Photo: Getty Images)
File photo of Pakistan pacer Mohammad Amir (Getty Images)



కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల కొన్ని కొత్త రూల్స్‌ని తెరపైకి తెచ్చింది. అందులో ఫస్ట్ రూల్.. మైదానంలో ఫీల్డర్ లేదా బౌలర్ బంతిపై ఉమ్ము లేదా చెమటని రుద్దకూడదు. సాధారణంగా బంతి నుంచి స్వింగ్ రాబట్టేందుకు బౌలర్ దానిపై ఉమ్ము రాస్తుంటాడు. కానీ.. కరోనా వేళ అలా చేస్తే.. ఆటగాళ్లందరికీ కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఉమ్ము లేదా చెమటని రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. ఒకవేళ బౌలర్ ఎవరైనా అలా బంతిపై ఉమ్ము రాస్తే..? వెంటనే అంపైర్లు టిష్యూతో దాన్ని శుభ్రం చేసి మ్యాచ్‌ని కొనసాగించాలని రూల్స్‌లో పేర్కొంది.


అలవాటులో పొరపాటుగా ఏ బౌలరైనా బంతిపై అలా ఉమ్ము రాస్తే..? తొలుత హెచ్చరించాలని అంపైర్లకి సూచించిన ఐసీసీ.. ఒక ఇన్నింగ్స్‌లో రెండు సార్లుకి మించి అలా రూల్స్‌ని బ్రేక్ చేస్తే.. టీమ్‌కి 5 పరుగులు జరిమానా విధించే అధికారాన్ని కూడా అంపైర్లకి ఇచ్చింది. కానీ.. మహ్మద్ అమీర్ విషయంలో ఫీల్డ్ అంపైర్లు ఉదాసీనంగా ఉండిపోయారు. దాంతో.. పాకిస్థాన్ పెనాల్టీ నుంచి తప్పించుకుంది. మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన అమీర్ 14 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.