యాప్నగరం

ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్‌కి కరోనా పాజిటివ్.. ఫస్ట్ క్రికెటర్

ఇంగ్లాండ్ జట్టులోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఐపీఎల్ 2020 సీజన్‌‌లో ఆడేందుకు నిరాకరించిన ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లీ.. అక్కడ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ వైరస్ బారినపడ్డాడు.

Samayam Telugu 18 Sep 2020, 7:09 am
ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన డేవిడ్ విల్లీ.. ప్రస్తుతం విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో యార్క్‌షైర్ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య బుధవారం రాత్రి మూడు వన్డేల సిరీస్ ముగియగా.. ఈ సిరీస్‌కి డేవిడ్ విల్లీ ఎంపికవలేదు. ఇంగ్లాండ్ తరఫున 48 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లను విల్లీ ఆడాడు.
Samayam Telugu ​David Willey
David Willey. (Reuters Photo)


యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఐపీఎల్‌లో ఆడేందుకు డేవిడ్ విల్లీ నిరాకరించాడు. విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో ఆఫర్ రావడంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గతంలో డేవిడ్ విల్లీ మ్యాచ్‌లు ఆడాడు.


ఇంగ్లాండ్ జట్టులోని ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్‌కి కరోనా వైరస్ సోకడం ఇదే తొలిసారికాగా.. డేవిడ్ విల్లీతో పాటు అతని భార్యకి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఇంగ్లాండ్ గడ్డపై నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు ఛార్టర్డ్ ప్లైట్‌లో గురువారం రాత్రి యూఏఈకి వచ్చిన విషయం తెలిసిందే. పీపీఈ కిట్లు ధరించి మరీ ప్రయాణం చేసిన ఈ క్రికెటర్లకి క్వారంటైన్ గడువుని యూఏఈ ప్రభుత్వం ఆరు రోజులకి బదులుగా 36 గంటలకి కుదించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.