యాప్నగరం

నాలుగో వన్డేలోనూ చిత్తు.. వైట్ వాష్ ముంగిట ఆసీస్

మూడో వన్డేలో 481 పరుగులతో ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తర్వాతి మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో ఆసీస్ మరోసారి వైట్‌వాష్ ముంగిట నిలిచింది.

Samayam Telugu 22 Jun 2018, 11:03 am
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ అదరగొడుతోంది. మూడో వన్డేలో 481 పరుగులతో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ నాలుగో వన్డేలోనూ.. కంగారూలను చిత్తు చేశారు. చెస్టర్ లి లీస్ట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. బదులుగా ఇంగ్లాండ్ 44.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది.
Samayam Telugu aus.


ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (100), ట్రావిస్ హెడ్ (63) తొలి వికెట్‌కు 101 పరుగులు జోడించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షాన్ మార్ష్ (101) కూడా శతకం చేశాడు. దీంతో ఆసీస్ 39.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కానీ మిడిలార్డర్‌ను విల్లే దెబ్బతీయడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 310/8కే పరిమితమైంది.

మూడో వన్డేలో 481 పరుగులు బాది మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 311 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. ఓపెనర్ జాసన్ రాయ్ (83 బంతుల్లో 101) సెంచరీ చేయగా, జానీ బెయిర్‌స్టో 79 పరుగులతో సత్తా చాటాడు. దీంతో ఇంగ్లాండ్ 23.4 ఓవర్లలో తొలి వికెట్‌కు 174 రన్స్ చేసింది. హేల్స్ (45 బంతుల్లో 34) నెమ్మదిగా ఆడగా.. జాస్ బట్లర్ (29 బంతుల్లో 54) దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ సునాయాసంగా గెలుపొందింది. ఈ విజయంతో ఐదు వన్డేలో సిరీస్‌లో 4-0 తేడాతో ఆధిక్యం సాధించింది.

చివరి మ్యాచ్‌లోనూ గెలిస్తే.. ఆసీస్‌ను ఇంగ్లాండ్ వైట్ వాష్‌ చేస్తుంది. ఆసీస్ ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే వైట్ వాష్‌కు గురైంది. 2016 అక్టోబర్లో సౌతాఫ్రికా జట్టు 5-0 తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.