యాప్నగరం

Tom Banton:5 బంతుల్లో 5 సిక్సర్లు.. 16 బాల్స్‌లో ఫిఫ్టీ

కోల్‌కతా నైట్‌రైడర్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఇంగ్లాండ్ ప్లేయర్ బాంటన్ నిలబెట్టుకున్నాడు. బీబీఎల్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదడమే గాకుండా 16 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. దీంతో ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో ఎలా ఆడతాడని అందరి ఫోకస్ అతనివైపు తిప్పుకున్నాడు.

Samayam Telugu 6 Jan 2020, 7:27 pm
ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్న కొత్త కుర్రాడు టామ్ బాంటన్ సిక్సర్ల మోత మోగించాడు. తాజాగా బిగ్ బాష్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి అదరహో అన్పించాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.కోటికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Samayam Telugu KKR BANTON2



ఐపీఎల్‌లో భారీ ధర పలికిన ఉత్సాహంలో తాజాగా జరిగిన మ్యాచ్‌లో బాంటన్ రెచ్చిపోయాడు. బ్రిస్బేన్ హీట్స్ తరపున బరిలోకి దిగిన అతను సిక్సర్ల మోత మోగించాడు. సిడ్నీ థండర్స్ స్పిన్నర్ అర్జున్ నాయర్ బౌలింగ్‌లో లాంగాన్ దిశలో నాలుగు కళ్లు చెదిరే సిక్సర్లు బాదిన బాంటన్.. మరో సిక్సర్ బౌలర్ తలమీదుగా బాదాడు. ఈక్రమంలో 16 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసుకున్నాడు.

Read Also : విరాట్ కోహ్లీ: మరింత సీరియస్‌గా ఆడతాం.. ఆ లోటు తీర్చుకుంటాం
మరోవైపు బాంటన్ తాజా బ్యాటింగ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ మేనేజ్మెంట్ కచ్చితంగా హ్యాపీగా ఫీలయ్యే ఉంటుంది. కనీస ధరకు ఈ ఇంగ్లీష్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్.. రాబోయే సీజన్‌లో అతణ్ని టాపార్డర్‌లో ఆడించే అవకాశముంది. ఐపీఎల్లో రెండుసార్లు 2012, 14లలో గెలిచిన కేకేఆర్.. గతేడాది ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంలో విఫలమైంది. ఈక్రమంల ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని ప్రణాళికలు రచిస్తోంది.

Read Also : గంగూలీ చాలా తెలివైనోడు.. ఆ చెత్త పనికి ఒప్పుకోడు.. అక్తర్ ధీమా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.