యాప్నగరం

వర్షంతో ఈరోజు మూడో టెస్టు ఆలస్యం

భారత్, ఇంగ్లాండ్ మధ్య నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా ఈరోజు ఆలస్యంగా ప్రారంభంకానుంది.

Samayam Telugu 19 Aug 2018, 3:56 pm
భారత్, ఇంగ్లాండ్ మధ్య నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా ఈరోజు ఆలస్యంగా ప్రారంభంకానుంది. శనివారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిన్న ఆట ముగిసే సమయానికి 307/6తో నిలిచింది. క్రీజులో రిషబ్ పంత్ (22 బ్యాటింగ్: 32 బంతుల్లో 2x4, 1x6) ఉన్నాడు.
Samayam Telugu England v India - Third Test


స్టేడియం పరిసరాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. అయితే.. తాజాగా వర్షం తగ్గుముఖం పట్టడంతో.. కవర్లను తొలగించిన సిబ్బంది ఆటకి సిద్ధం చేసే పనిలో ఉన్నారు. దీంతో.. మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభంకానుంది.

ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింటిలోనూ ఇంగ్లాండ్ జట్టు ఘన విజయాల్ని అందుకుంది. దీంతో.. తీవ్ర ఒత్తిడి మధ్య మూడో టెస్టుని ఆరంభించిన భారత జట్టు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (97: 152 బంతుల్లో 11x4), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (81: 131 బంతుల్లో 12x4) నిలకడగా ఆడటంతో తొలిరోజు ఇంగ్లాండ్‌కి గట్టి పోటీనిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.