యాప్నగరం

జాసన్ రాయ్ భారీ శతకం.. ఆసీస్‌పై ఇంగ్లాండ్ గెలుపు

ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ భారీ శతకంతో చెలరేగడంతో.. ఆసీస్‌‌తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లిష్ జట్టు చరిత్ర సృష్టించింది.

TNN 14 Jan 2018, 5:01 pm
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లిష్ జట్టును ఓపెనర్ జాసన్ రాయ్ భారీ శతకంతో గెలుపు బాటలో నడిపాడు. 151 బంతుల్లో 180 పరుగులు (16x4, 5x6) చేసిన రాయ్.. ఆసీస్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 60 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. జోయ్ రూట్ (91 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం.
Samayam Telugu england won by 5 wickets in first odi
జాసన్ రాయ్ భారీ శతకం.. ఆసీస్‌పై ఇంగ్లాండ్ గెలుపు


ఇన్నింగ్స్ 43 ఓవర్లో అవుటైన రాయ్.. డబుల్ సెంచరీ చేసే అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. కానీ ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. గతంలో అలెక్స్ హేల్స్ (171) పేరిట ఉన్న రికార్డ్‌ను జాసన్ రాయ్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగానూ రాయ్ రికార్డ్ నెలకొల్పాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా రాయ్‌దే కావడం విశేషం.


అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (107) సెంచరీ సాధించగా.. మిచెల్ మార్ష్, స్టోయినిస్ అర్ధ సెంచరీలతో రాణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.