ఇప్పటి వరకూ తన ట్వీట్లతో అభిమాలను నవ్విస్తూ వచ్చిన వీరూ.. కొత్త ఏడాదిలో యువతకు హితబోధ చేస్తున్నాడు. ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ.. ఈ రెండు లక్షణాలున్న స్నేహితులు మాత్రం ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఉండాలని డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. మనకు కచ్చితంగా కృష్ణుడి లాంటి స్నేహితుడు ఉండాలి. అతడు నీ తరఫున యుద్ధం చేయకపోవచ్చు గానీ.. నీకు విజయం వరించేలా మాత్రం చేయగలడు. అతడి సలహాలు నీకు పనికొస్తాయి అని చెప్పాడు. అలాగే కర్ణుడి లాంటి స్నేహితుడు కూడా మనకు అవసరమే. నువ్వు చేసేది తప్పయినప్పటికీ అతడు అన్ని వేళలా నీ వెంట నడుస్తాడు అని వీరూ ట్వీట్ చేశాడు.
Every1 shud have 1 frnd like Krishna who wont fight fr u,bt wl make sure u win d war& 1frnd like Karna who will fight fr u even if u r wrong — Virender Sehwag (@virendersehwag) January 2, 2017
నిజమే కదా.. కృష్ణుడు లేకుండా కురుక్షేత్రంలో పాండవులు విజయం సాధించేవారు కాదుగా. కృష్ణుడి లాంటి మిత్రుడి వల్ల కలిగే ప్రయోజనం తెలుసు కాబట్టే అతడు తన సైన్యాన్ని కౌరవుల తరఫున యుద్ధానికి పంపినా.. తాను రణం చేయనని చెప్పినా.. నల్లనయ్య తమ వైపు ఉంటే చాలు విజయం తమదేనని పాండవులు గ్రహించారు. ఇక ధుర్యోధనుడు చేసేది తప్పని తెలిసినా.. కర్ణుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన మిత్రుడి కోసం పోరాడాడు. ఇలాంటి స్నేహితులు ఇద్దరు ఉంటే చాలు.. ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా అలవోకగా వాటిని అధిగమిస్తాడు.