యాప్నగరం

పుజారాలో సహనం అలా వచ్చిందేనట..!

మూడు టెస్టులు ముగిసే సరికి వివాదాల్లో కోహ్లి ఫస్ట్ నిలవగా ఆటతో చతేశ్వర్ పుజారా అగ్రస్థానంలో

TNN 23 Mar 2017, 9:02 pm
ఆస్ట్రేలియాతో సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో ఎలా రెచ్చిపోతాడోనని అంతా చర్చించుకున్నారు. కానీ.. మూడు టెస్టులు ముగిసే సరికి వివాదాల్లో కోహ్లి ఫస్ట్ నిలవగా ఆటతో చతేశ్వర్ పుజారా అగ్రస్థానంలో నిలిచాడు. సహచర బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలిచేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో సహనంతో రాంచీలో డబుల్ సెంచరీ బాది తను ‘టెస్టు స్పెషలిస్ట్’ అని మరోసారి నిరూపించుకున్నాడు. సిరీస్‌లో విజేత నిర్ణయాత్మక నాలుగో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి ధర్మశాల వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో పుజారా మాట్లాడుతూ క్రీజులో గంటల కొద్దీ నిలిచే సహనం తనకు ఎలా అలవడిందో వివరించాడు.
Samayam Telugu experience of playing domestic cricket working hard
పుజారాలో సహనం అలా వచ్చిందేనట..!


‘నేను 8 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడుతున్నాను. సౌరాష్ట్ర తరఫున 13వ ఏట అరంగేట్రం చేశాను. అప్పటి నుంచి వరుసగా టెస్టు మ్యాచ్‌లు ఆడుతూ.. అనుభవపూర్వకంగా క్రీజులో ఎలా సహనంతో ఉండాలో నేర్చుకున్నాను. ఫిటెనెస్ విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను. ముఖ్యంగా పోషకాహారం, కంటి నిండా నిద్రకి ప్రాధాన్యమిస్తాను. ఒకవేళ అలసటగా అనిపించినప్పడు మసాజ్ చేయించుకోవడం ద్వారా తిరిగి ఉత్తేజం పొందుతాను. కెరీర్ ఆరంభంలో ఆడిన ప్రతి దేశవాళీ మ్యాచ్‌లోనూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ప్రయత్నించడం కూడా ఈ ఓపిక అలవడటానికి కారణం కావచ్చు’ అని పుజారా వివరించాడు. ధర్మశాల మైదానంలో ఇప్పటికే చాలా దేశవాళి మ్యాచ్‌లు ఆడానని.. పిచ్‌ గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లు ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ధీమా వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.