యాప్నగరం

శార్దుల్.. బుద్ధి ఉందా.. ఆ జెర్సీని వదులుకో!

శ్రీలంకపై నాలుగో వన్డేలో అరంగేట్రం చేసిన శార్దుల్ ఠాకూర్‌పై, బీసీసీఐ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

TNN 1 Sep 2017, 2:24 pm
శ్రీలంకపై ఐదు వన్డేల సిరీస్‌ను 3-0తో గెలుచుకోవడంతో.. నాలుగో వన్డేలో కోహ్లి సేన ప్రయోగాలు చేసింది. అందులో భాగంగా పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌కు జట్టులో చోటు కల్పించింది. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతున్న 300 వన్డేతోనే శార్దుల్ అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేసిన 218వ ఆటగాడు ఠాకూర్. ఆడిన తొలి మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్.. 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. భువీ స్థానంలో ఆడిన శార్దూల్ ఒక దశలో గంటకు 145 కి.మీ.పైగా వేగంతో బంతులు విసిరాడు.
Samayam Telugu fans troll shardul thakur for wearing jersey number 10 on odi debut
శార్దుల్.. బుద్ధి ఉందా.. ఆ జెర్సీని వదులుకో!


తొలి మ్యాచ్‌లో శార్దుల్ ఆటతీరు చూసి అభిమానులు సంతృప్తి చెందారు. కానీ అతడు వేసుకున్న జెర్సీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో శార్దుల్ ఠాకూర్ పదో నంబర్ జెర్సీతో బరిలోకి దిగాడు. ఒకప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వేసుకున్న జెర్సీ అది. టెండుల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత.. అతడి గౌరవార్థం ఆ జెర్సీని ఎవరూ ఉపయోగించడం లేదు. 'టెండుల్కర్ స్ఫూర్తితో క్రికెట్లోకి వచ్చానంటున్న శార్దుల్.. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ పదో నంబర్ జెర్సీనే ఉపయోగించాడు.

@BCCI Jersey no 10 belongs to one and only @sachin_rt We cant accept anyone wearing that Jersey no.. pic.twitter.com/ybb4oqzpBb — sachin_tendulkar_fc (@akshusachinist) August 31, 2017
కానీ సచిన్ ఎక్కువ కాలం వాడిన పదో నెంబర్ జెర్సీని బీసీసీఐ అతడికి ఎలా ఇస్తుందంటూ... అభిమానులు మండిపడుతున్నారు. శార్దుల్.. జెర్సీ మార్చుకో అంటూ సలహా ఇస్తున్నారు. శార్దుల్ తర్వాతి మ్యాచ్‌లో ఏ జెర్సీతో బరిలో దిగనున్నాడో మరి.

Dear @imShard do u have any sense to take #jerseyno10 from @sachin_rt You don't know it is belongs to our god #SachinTendulkar @BCCI 😡😡😬 pic.twitter.com/hAirscElG8 — VenkatBharatKorikana (@LoyalSachiNist) September 1, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.