యాప్నగరం

ఆఖరి బంతికి 6 పరుగులు కావాలి.. ధోనీకి ఆ బాల్‌ని వేస్తా: పాట్ కమిన్స్

మహేంద్రసింగ్ ధోనీ ఎలాంటి బంతినైనా సిక్స్‌గా మలచగలడు. అయితే.. బౌలర్లు చాలా వరకూ ఆఖర్లో అతనికి యార్కర్లు విసిరేందుకు ప్రయత్నిస్తుంటారు. దాంతో.. హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్‌లను ధోనీ ముగిస్తుంటాడు. అయితే..?

Samayam Telugu 28 May 2021, 11:05 am

ప్రధానాంశాలు:

  • క్రికెట్‌ ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్‌గా కితాబులు అందుకున్న ధోనీ
  • చివరి బంతికి సిక్స్ కొట్టాలంటే అతనికి ఏ బంతి వేస్తావని కమిన్స్‌కి ప్రశ్న
  • యార్కర్‌ బాల్ మాత్రం వేయనని స్పష్టం చేసిన పాట్ కమిన్స్
  • ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇద్దరూ మళ్లీ ఢీకొనే ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu MS Dhoni, Pat Cummins (Pic Credit: IPL/BCCI)
మ్యాచ్‌లను ఫినిష్ చేయడంలో మహేంద్రసింగ్ ధోనీకి తిరుగులేదు. సుదీర్ఘకాలంగా ఫినిషర్ రోల్‌ని చక్కగా పోషిస్తున్న ధోనీ.. చివరి బంతికి మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. ఒకవేళ చివరి బంతికి ధోనీ క్రీజులో ఉండి.. విజయానికి ఆరు పరుగులు చేయాల్సిన దశలో.. అతనికి ఎలాంటి బంతిని విసురుతావు..? అని ఓ అభిమాని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ని సరదాగా ప్రశ్నించాడు. దాంతో.. తొలుత తటపటాయించిన కమిన్స్ ఆఖరిగా తాను ఓ మూడు రకాల బంతుల్ని విసురుతానని చెప్పుకొచ్చాడు.
‘‘మహేంద్రసింగ్ ధోనీ యార్కర్ బంతుల్ని కూడా అలవోకగా సిక్సర్లు బాదిన వీడియోలను నేను చూశాను. కాబట్టి.. నేను యార్కర్ బంతిని మాత్రం విసరను. వీలైతే స్లో బౌన్సర్ లేదా స్లో బాల్ లేదా వైడ్ యార్కర్‌ని విసురుతాను. అన్నింటికీ మించి నేను ఆ పరిస్థితుల్లో ధోనీకి బౌలింగ్ చేయాలని కోరుకోను’’ అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌కి ఆడిన పాట్ కమిన్స్ ఏడు మ్యాచ్‌లాడి.. 9 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ధోనీ ఏడు మ్యాచ్‌లాడి 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు.

2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇకపై ధోనీ, కమిన్స్ ఢీకొట్టేది కేవలం ఐపీఎల్‌లో మాత్రమే. పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనూ పొదుపుగా కమిన్స్ బౌలింగ్ చేస్తుండగా.. ధోనీ ఇప్పటికీ చెన్నై టీమ్‌లో ఫినిషర్ రోల్‌ని పోషిస్తున్నాడు. దాంతో.. సెప్టెంబరులో మళ్లీ ఐపీఎల్ 2021 సీజన్ పునః ప్రారంభం కానుండటంతో.. ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.