యాప్నగరం

ఓటమి భయమే శ్రీలంకని ముంచేస్తోంది..!

భారత్‌తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్‌లో శ్రీలంక ఓటమి భయంతోనే ఒత్తిడికి గురై పరాజయాలను చవిచూస్తోందని

TNN 24 Aug 2017, 7:15 pm
భారత్‌తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్‌లో శ్రీలంక ఓటమి భయంతోనే ఒత్తిడికి గురై పరాజయాలను చవిచూస్తోందని ఆ దేశ మాజీ క్రికెటర్ మహేల జయవర్దనె అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 3-0తో క్లీన్‌స్వీప్‌కి గురైన ఆ జట్టు.. తొలి వన్డేలోనూ పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసింది. తాజాగా గురువారం జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236/8కే పరిమితమైంది.
Samayam Telugu fear of failure hurting sri lanka mahela jayawardene
ఓటమి భయమే శ్రీలంకని ముంచేస్తోంది..!


‘శ్రీలంక జట్టు ఆత్మవిశ్వాసం ప్రస్తుతం పూర్తిగా సన్నగిల్లింది. వారిలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోంది. మ్యాచ్ గెలవాలనే పట్టుదల, గెలుస్తామనే ధీమా ఇసుమంతైనా వారిలో నాకు కనిపించడం లేదు. జట్టుతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కార మార్గం కనిపెట్టాలి. టెస్టు సిరీస్‌లో తమ ప్రదర్శనపై జట్టులోని క్రికెటర్లందరూ చాలా నిరాశలో ఉన్నారు. కనీసం వన్డేల్లోనైనా భారత్‌కి పోటీనివ్వాలంటే.. వారిలో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపాల్సిందే’ అని జయవర్దనె వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.