యాప్నగరం

ఐస్‌లాండ్ టీమ్‌పై సెక్స్‌ బ్యాన్ లేదు..!

ఫిఫా ప్రపంచకప్‌లో ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు ఐస్‌లాండ్‌ టీమ్‌పై సెక్స్ బ్యాన్ విధించినట్లు వస్తున్న వార్తలకి ఆ జట్టు కోచ్

Samayam Telugu 21 Jun 2018, 10:21 pm
ఫిఫా ప్రపంచకప్‌లో ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు ఐస్‌లాండ్‌ టీమ్‌పై సెక్స్ బ్యాన్ విధించినట్లు వస్తున్న వార్తలకి ఆ జట్టు కోచ్ హేమిర్ హాల్‌గ్రిమ్‌సన్ స్పందించాడు. ఆటగాళ్లకి అలాంటి ఆంక్షలు ఏమీ విధించలేదని ఆయన స్పష్టం చేశాడు.
Samayam Telugu World Cup - Iceland Training
Soccer Football - World Cup - Iceland Training - Volgograd Arena, Volgograd, Russia - June 21, 2018 Iceland's Gylfi Sigurdsson with team mates during training REUTERS/Ueslei Marcelino


గత శనివారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడిన పసికూన ఐస్‌లాండ్ మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ముఖ్యంగా.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ దాదాపు 10 సార్లు గోల్‌ కోసం ప్రయత్నించినా.. ఐస్‌లాండ్ టీమ్ అడ్డుగోడగా నిలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

గ్రూప్‌-డిలో ఉన్న ఐస్‌లాండ్ తర్వాత మ్యాచ్‌ని శుక్రవారం నైజీరియాతో తలపడనుంది. అర్జెంటీనాతో తొలి మ్యాచ్‌కి ముందు కుటుంబాలకి దూరంగా ఉన్న ఆటగాళ్లు.. గురువారం వారిని కలిశారు. నైజీరియాతో రేపు జరిగే మ్యాచ్‌లో ఐస్‌లాండ్ గెలవగలిగితే.. నాకౌట్ అవకాశాలు మెరుగవనున్న నేపథ్యంలోనే ఆటగాళ్లను కుటుంబాలతో కలిపినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.