యాప్నగరం

కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాహా.. కోహ్లి ఖుషీ!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో సాహా పట్టిన అద్భుత క్యాచ్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.

TNN 23 Feb 2017, 4:59 pm
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. 259 పరుగులకు 9 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్టీవ్ ఒకిఫే ఆడిన బంతిని అద్భుతంగా అందుకున్నాడు. తన నుంచి దూరంగా వెళ్తున్న బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి సాహా అందుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వికెట్ కీపర్ సాహానా? లేదా సూపర్ మ్యానా? అంటూ కామెంటేటర్లు సాహాను ప్రశంసలతో ముంచెత్తారు. వృద్ధిమాన్ చక్కగా బంతిని ఒడిసిపట్టుకోవడంతో ఒకీఫే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
Samayam Telugu flying saha catches one out of thin air dismisses s okeefe
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాహా.. కోహ్లి ఖుషీ!



సాహా క్యాచ్ పట్టిన తీరు కోహ్లి సహా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. క్యాచ్ అందుకున్న వెంటనే కోహ్లి అతణ్ని హత్తుకొని అభినందించాడు. బ్యాట్స్‌మెన్ బంతిని బాదాక కేవలం 0.31 సెకన్లలోనే ఎగిరి మరీ అందుకున్నాడంటే సాహా ఎంత నిశితంగా బంతిని పరిశీలించాడో అర్థం చేసుకోవచ్చు. ఇక శస్త్రచికిత్స కారణంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అయితే.. సాహాను ఇక నుంచి తప్పకుండా ఫ్లయింగ్ సాహా అని పిలవాల్సిందే అంటూ ట్వీట్ చేశాడు. గతంలో ఢిల్లీలో దక్షిణాఫ్రికాపై కూడా ఇదే తరహాలో అతడు క్యాచ్ పట్టాడంటూ గుర్తు చేశాడు.


కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అయితే.. ఇలాంటి క్యాచ్‌ను నేనిప్పటి వరకూ చూడలేదంటూ ట్వీట్ చేశాడు. సాహా ఇలాగే క్యాచ్‌లు పడితే ఒక్క దోమ కూడా మిగలదంటూ నెటిజన్లు సరదా ట్వీట్లు చేశారు.

#FlyingSaha is what we should call him, remember one he took against South Africa in Delhi #IndvAus #Ripper— Rohit Sharma (@ImRo45) February 23, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.