యాప్నగరం

షేన్‌వార్న్ టీమ్‌లో ధోనీ, కోహ్లీకి దక్కని చోటు

షేన్‌వార్న్ తన టీమ్‌లో దిగ్గజ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీకి చోటిచ్చాడు. కానీ.. ధోనీ, కోహ్లీకి మాత్రం అందులో చోటివ్వలేదు. ఇక గంగూలీకి అయితే.. ఏకంగా కెప్టెన్సీ అవకాశం కల్పించాడు.

Samayam Telugu 1 Apr 2020, 9:06 pm
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ ఎంపిక చేసిన గ్రేటెస్ట్ ఇండియా ఎలెవన్ టీమ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కలేదు. తనతో పాటు క్రికెట్ ఆడిన భారత ఆటగాళ్లతో కలిసి ఓ జట్టుని ప్రకటించిన షేన్‌వార్న్.. అందులో వికెట్ కీపర్‌గా నయాన్ మోంగియాకి చోటిచ్చాడు. ధోనీతో పాటు.. విరాట్ కోహ్లీకి కూడా ఈ టీమ్‌లో చోటు లభించలేదు.
Samayam Telugu ​Shane Warne
Shane Warne and Sourav Ganguly. (Getty Images)


Read More: యువరాజ్‌ని భయపెట్టిన బౌలర్ అతనే..!

షేన్‌వార్న్ గ్రేటెస్ట్ ఇండియా టీమ్ ఇదే: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, కపిల్ దేవ్, నయాన్ మోంగియా (వికెట్ కీపర్), హర్భజన్ సింగ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే

తన టీమ్‌లో ధోనీ, కోహ్లీకి చోటివ్వకపోవడంపై షేన్‌వార్న్ మాట్లాడుతూ ‘‘నేను క్రికెట్ ఆడే రోజుల్లో నాకు ప్రత్యర్థిగా ఆడిన భారత క్రికెటర్లతో మాత్రమే ఈ జట్టుని ఎంపిక చేశాను. కాబట్టి.. ధోనీ, విరాట్ కోహ్లీకి ఈ టీమ్‌ చోటివ్వలేదు. వాస్తవానికి ధోనీ గొప్ప వికెట్ కీపర్. ఇక విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్’’ అని వెల్లడించాడు.

Read More : స్టీవ్ స్మిత్‌కి మళ్లీ కెప్టెన్సీ ఇవ్వొద్దు: షేన్‌వార్న్

టీమ్‌లోకి నవజ్యోత్ సిద్ధుని ఎంపిక చేయడంపై మాట్లాడుతూ ‘‘సిద్ధు.. స్పిన్ బౌలింగ్‌లో గొప్పగా బ్యాటింగ్ చేస్తాడు. అందుకే.. అతడ్ని టీమ్‌లోకి ఎంపిక చేశాను. నా బౌలింగ్‌లోనే కాదు.. చాలా మంది స్పిన్నర్లు చెప్పిన మాట ఏంటంటే..? సిద్ధు స్పిన్నర్లని సమర్థంగా ఎదుర్కోంటాడు’’ అని షేన్‌వార్న్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.