యాప్నగరం

​ భారత్‌పై శ్రీలంక గెలవడమా..? నో ఛాన్స్

వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న భారత్‌ జట్టుని వారి సొంతగడ్డపై శ్రీలంక ఓడిస్తే అది అద్భుతమేనని శ్రీలంక మాజీ కోచ్ డేవ్ వాట్మోర్

TNN 8 Nov 2017, 7:48 pm
వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న భారత్‌ జట్టుని వారి సొంతగడ్డపై శ్రీలంక ఓడిస్తే అది అద్భుతమేనని శ్రీలంక మాజీ కోచ్ డేవ్ వాట్మోర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు బుధవారం శ్రీలంక జట్టు కోల్‌కతాకి చేరుకుంది. నవంబరు 16న ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌తో సుదీర్ఘ సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో సిరీస్ తీరుపై ఈ మాజీ కోచ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
Samayam Telugu former coach dav whatmore rules out sri lankas chances of springing a surprise against india
​ భారత్‌పై శ్రీలంక గెలవడమా..? నో ఛాన్స్


‘శ్రీలంక జట్టుకి ఇదో కఠినమైన పర్యటన. సొంతగడ్డపైనే శ్రీలంక జట్టు భారత్‌ని ఓడించలేకపోయింది. ఇక.. వారి స్వదేశంలో టీమిండియాని ఓడించడమా..? ఆలోచనే కష్టంగా ఉంది. కోహ్లి సేన ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్‌లో చాలా మంది మంచి నైపుణ్యమున్న బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. బౌలింగ్ పరంగా కూడా స్పిన్నర్లు, పేసర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఓటమిని అంగీకరించని వ్యక్తి కెప్టెన్‌గా ఉండటం భారత్‌కి అదనపు బలం’ అని
డేవ్ వాట్మోర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.