యాప్నగరం

సచిన్ 100 సెంచరీల రికార్డ్‌ కోహ్లీకి కష్టమే.. కానీ: పీటర్సన్

విరాట్ కోహ్లీ ఈ ఏడాది నవంబరులో 32వ పడిలోకి అడుగుపెడతాడు. వన్డే, టీ20లు, టెస్టులతో పాటు ఏటా ఐపీఎల్ ఆడుతున్న విరాట్ కోహ్లీ గాయాలబారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ.. అప్పట్లో సచిన్‌కి ఈ సమస్య లేదు -పీటర్సన్

Samayam Telugu 16 May 2020, 9:55 am
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 అంతర్జాతీయ శతకాల రికార్డ్‌ని విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడం కష్టమేనని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 1989 నుంచి 2013 వరకూ క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్‌తో శాసించిన సచిన్ టెండూల్కర్.. 200 టెస్టులాడి 51 సెంచరీలు, 463 వన్డేలాడి 49 శతకాలు సాధించాడు. మొత్తంగా వరల్డ్‌ క్రికెట్‌లోనే 100 సెంచరీల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా రికార్డ్‌ నెలకొల్పాడు.
Samayam Telugu Virat Kohli ,Sachin Tendulkar


Read More: ఐపీఎల్ 2020 సీజన్ రెండు సిటీల్లోనే..? 2014 ఫార్మాట్‌ మళ్లీ తెరపైకి..!

సచిన్ 100 శతకాల రికార్డ్‌ని విరాట్ కోహ్లీ మాత్రమే బ్రేక్ చేయగలడని గత కొంతకాలంగా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని కెవిన్ పీటర్సన్‌ని అడగగా.. కొన్ని లాజికల్ కారణాలు చెప్పిన అతను విరాట్ కోహ్లీకి కష్టమేనని ఆఖరిగా తేల్చేశాడు. 2008 నుంచి ఇప్పటి వరకూ 86 టెస్టులాడిన కోహ్లీ 27 సెంచరీలు, 248 వన్డేల్లో 43 శతకాలు సాధించాడు. మొత్తంగా.. 70 సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్‌లో జోరుని కొనసాగిస్తున్నాడు.

Read More: భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ మొత్తం ఒక్క స్టేడియంలోనే..?

‘‘సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఆ 100 శతకాల రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. గాయాల బెడద. మైదానంలో సచిన్ ఎక్కువగా ఎమోషన్ అయ్యేవాడు కాదు. అలానే ఫీల్డింగ్‌లోనూ దూకుడు తక్కువగా ఉండేది. కానీ.. విరాట్ కోహ్లీ అతనికి పూర్తి భిన్నం. కాబట్టి.. గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక అప్పట్లో సచిన్‌తో పోలిస్తే ఇప్పుడు కోహ్లీపై పనిభారం కూడా పెరిగింది. సచిన్ తన కెరీర్‌లో వన్డే, టెస్టులే ఎక్కువగా ఆడాడు. టీ20లు, ఐపీఎల్‌‌లో ఆడింది తక్కువ. కానీ.. విరాట్ కోహ్లీ వన్డే, టెస్టులు, టీ20 ఇలా మూడు ఫార్మాట్లతో పాటు ఏటా ఐపీఎల్‌ని ఆడుతున్నాడు. కాబట్టి.. ఇదే తరహాలో అతను ఎంతకాలం క్రికెట్ ఆడతాడో తెలీదు’’ అని పీటర్సన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.