యాప్నగరం

Cricketపై ప్రేమ అంటే ఇది..! కాళ్లు చచ్చుబడినా వికెట్ల మధ్య పరుగు.. సచిన్ ఫిదా

అంతర్జాతీయ క్రికెట్‌లో కొద్ది మంది క్రికెటర్లు వికెట్ల మధ్య బద్ధకంగా పరుగు తీస్తుంటారు. కానీ.. దివ్యాంగుడైన ఓ బాలుడు సింగిల్ కోసం పడుతున్న తపనని వారు చూస్తే కచ్చితంగా సిగ్గుపడతారు.

Samayam Telugu 1 Jan 2020, 6:12 pm
క్రికెట్.. జెంటిల్మెన్ గేమ్. ఇందులో రాణించాలంటే ఆటగాడకి ప్రతిభతో పాటు ఫిట్‌నెస్ తప్పనిసరి..! కానీ.. ఓ దివ్యాంగ బాలుడు కాళ్లు చచ్చుబడిపోయినా.. మొక్కవోని దీక్షతో తోటి పిల్లలతో కలిసి పోటాపోటీగా క్రికెట్ ఆడుతున్నాడు. బంతిని హిట్ చేసిన తర్వాత ఈ బుడతడు వికెట్ల మధ్య పరుగు తీస్తున్న తీరుకి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయిపోయాడు. ఎంతలా అంటే..? నూతన సంవత్సరాన్ని ఈ స్ఫూర్తిమంతమైన వీడియోతో ఆరంభించండి అని సచిన్ స్వయంగా ఆ వీడియోని ట్వీట్ చేశాడు.
Samayam Telugu Sachin Tendulkar, disabled boy playing cricket


Read More: కోహ్లీ ఎనర్జీ ఏ కెప్టెన్‌కీ లేదంతే..! : కోచ్ రవిశాస్త్రి


క్రికెట్ ఆడుతున్న బాలుడి పేరు మద్దా రామ్ అని తెలిసినా.. అతని పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ.. ఓ పాఠశాలలో పిల్లలతో కలిసి అతను మ్యాచ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. అదీ మ్యాచ్‌లో బ్యాట్ ఒక్కటే ఉండటంతో.. సింగిల్ తీసిన రామ్.. ఆ బ్యాట్‌ని స్ట్రైకింగ్‌కి వెళ్లిన మరో బాలుడికి అందించేందుకు మళ్లీ పిచ్ మధ్యలోకి వెళ్లిన తీరు చూస్తే..? అతనికి ఆటపై ఉన్న అంకితభావం స్పష్టమవుతోంది. ఇప్పుడు అందరూ రామ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read More: భారత్‌తో టీ20 సిరీస్‌కి శ్రీలంక జట్టు ప్రకటన
2020-30 దశాబ్దాన్ని పిల్లలకి అంకితం చేద్దామని మంగళవారం పిలుపునిచ్చిన సచిన్ టెండూల్కర్.. వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని సూచించాడు. అలానే తల్లిదండ్రులు తమ పిల్లల తప్పుల్ని సరిచేయడమే కాకుండా వారిని సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరాడు. అప్పుడే వారికి నేర్చుకోవాలనే తపన పెరుగుతుందన్నాడు.

Read More: ప్రేమలో పడిన హార్దిక్ పాండ్యా.. సాక్ష్యమిదిగో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.