యాప్నగరం

Ganguly IPL Teamలో ధోనీకి దక్కని చోటు.. కీపర్‌గా ఎవరంటే..?

రిషబ్ పంత్‌కి గత మూడు నెలలుగా మద్దతుగా నిలుస్తున్న సౌరవ్ గంగూలీ.. తాజాగా తన డ్రీమ్ ఐపీఎల్ టీమ్‌లో అతనికి వికెట్ కీపర్‌గా చోటిచ్చాడు. మరోవైపు ధోనీకి కనీసం జట్టులో కూడా గంగూలీ చోటివ్వలేదు.

Samayam Telugu 24 Dec 2019, 2:49 pm
ఐపీఎల్ 2020 సీజన్ హంగామా అప్పుడే మొదలైపోయింది. ఈ సీజన్‌కి సంబంధించిన ఆటగాళ్ల వేలం గత గురువారం జరగగా.. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. తన డ్రీమ్‌ ఎలెవన్ ఐపీఎల్ జట్టుని తాజాగా ప్రకటించాడు. ఇందులో వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీకి చోటివ్వని గంగూలీ.. రిషబ్ పంత్‌కి అవకాశం కల్పించాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? కెప్టెన్‌గా తన పేరునే గంగూలీ ప్రకటించుకున్నాడు.
Samayam Telugu MS Dhoni IPL 2020


Read More: undefined
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌కి ఆడిన గంగూలీ కనీసం ఒక్కసారి కూడా టీమ్‌కి టైటిల్‌ని అందించలేకపోయాడు. మరోవైపు మహేంద్రసింగ్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా మూడు టైటిల్స్‌ని అందించాడు. ఇప్పటికి కూడా క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ ఎవరంటే..? మొదట వినిపించే పేరు ధోనీ. అలాంటిది కెప్టెన్‌గా కాకపోయినా.. కనీసం వికెట్ కీపర్‌గా అయినా గంగూలీ తన టీమ్‌లో ధోనీకి చోటిచ్చి ఉండాల్సిందని అభిమానులు మండిపడుతున్నారు. అయితే.. యువ క్రికెటర్లని ప్రోత్సహించడంలో గంగూలీ ఎప్పుడు ముందుంటాడని.. ధోనీకి కూడా గతంలో గంగూలీ ఇలానే మద్దతుగా నిలిచాడంటూ దాదా అభిమానులు గుర్తు చేస్తున్నారు.

Read More: శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం భారత్ జట్టు ప్రకటన.. బుమ్రా, ధావన్ రీఎంట్రీ

గంగూలీ ప్రకటించిన డ్రీమ్ ఎలెవన్ ఐపీఎల్ టీమ్ ఇదే: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మార్కస్ స్టాయినిస్, రవీంద్ర జడేజా, ఆండ్రీ రసెల్, రియాన్ పరాగ్, జస్‌ప్రీత్ బుమ్రా, జోప్రా ఆర్చర్

ఐపీఎల్ 2020 సీజన్ వచ్చే ఏడాది మార్చి ఆఖరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభంకానుండగా.. గత వారం రోజుల నుంచి ఐపీఎల్ టీమ్స్ గురించి చర్చ మొదలైన విషయం తెలిసిందే. తాజాగా గంగూలీ టీమ్‌ గురించి అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.