యాప్నగరం

అష్రాఫ్ చాచాకి సచిన్ టెండూల్కర్ ఆర్థిక సాయం..!

సచిన్ టెండూల్కర్ బ్యాట్‌లకి సుదీర్ఘకాలం మరమ్మతులు చేసిన అష్రాఫ్ చౌదరి ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉపాధి కోల్పోయిన అతని ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు దయనీయంగా మారింది. దాంతో...?

Samayam Telugu 26 Aug 2020, 1:12 pm
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మంచి మనసు చాటుకున్నాడు. తన బ్యాట్‌లకి ఒకప్పుడు మరమ్మతులు చేసిన అష్రాఫ్ చౌదరికి.. కష్ట సమయంలో అండగా నిలిచి ఆర్థిక సాయం అందించాడు. ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లకి బ్యాట్‌లను తయారు చేసి ఇవ్వడంతో పాటు.. వాటికి మరమ్మతులు కూడా చేసిన అష్రాఫ్.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవడంతో ఉపాధి కోల్పోయాడు.
Samayam Telugu ​Sachin Tendulkar
Sachin Tendulkar celebrates reaching the 15,000-run mark on June 29, 2007. ( PETER MUHLY/AFP via Getty Images)


భారత స్టార్ క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు క్రిస్‌‌గేల్, కీరన్ పొలార్డ్, స్టీవ్‌స్మిత్ తదితరులు కూడా అష్రాఫ్ వద్ద తమ బ్యాట్‌లకి మరమ్మతులు చేసుకున్నారు. అయితే.. ఇటీవల అష్రాఫ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఒకవైపు అతని ఉపాధి కూడా దెబ్బతినడంతో.. కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా భరించలేని స్థితిలో అష్రాఫ్ ఉన్నాడు. దాంతో.. అతనికి సాయం చేసేందుకు ఇప్పటికే నటుడు సోనూసూద్ ముందుకురాగా.. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా ఆర్థిక సాయం అందించినట్లు అష్రాఫ్ స్నేహితుడు తెలిపారు.

క్రికెట్ సిరీస్‌లకి ముందే కాదు.. మ్యాచ్‌లు జరిగే సమయాల్లోనూ అవసరమైతే స్టేడియాల్లోనే బ్యాట్‌‌లకి అష్రాఫ్ మరమ్మతులు చేసేవాడు. ఏటా ఐపీఎల్ సమయంలో అతని బిజినెస్ బాగుండేదని సన్నిహితులు చెప్తున్నారు. కానీ.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.