యాప్నగరం

Sachin Tendulkar సహచర క్రికెటర్ పని కోసం రిక్వెస్ట్.. స్వయం కృతాపరాదం!

Vinod Kambli క్రికెట్ అభిమానులకి పరిచయమే. సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్కూల్‌డేస్‌లోనే ప్రపంచకప్ రికార్డ్‌ని వినోద్ కాంబ్లే నెలకొల్పాడు. అలానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఏడాది వ్యవధిలోనే పరుగుల వరద పారించేశాడు. కానీ.. డబ్బు, హోదా అతడ్ని మద్యానికి బానిసని చేసింది. దాంతో భారత్ జట్టుకి కూడా దూరమైపోయిన కాంబ్లి కేవలం పెన్షన్‌పై జీవనం సాగిస్తూ వచ్చాడు. మధ్యలో అప్పుడప్పుడు మద్యం తాగి గొడవలు, యాక్సిడెంట్లతో వార్తల్లో నిలిచాడు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 17 Aug 2022, 5:05 pm

ప్రధానాంశాలు:

  • ఆర్థిక ఇబ్బందుల్లో సచిన్ సహచర క్రికెటర్ వినోద్ కాంబ్లి
  • పని కోసం ముంబయి క్రికెట్ అసోషియేషన్‌ని రిక్వెస్ట్
  • ఇన్నాళ్లు బీసీసీఐ పెన్షన్‌తోనే జీవనం
  • మద్యం వ్యసనంతో అప్పట్లో గాడి తప్పిన కెరీర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vinod Kambli, Sachin Tendulkar (Pic Source: Twitter)
వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్ (Pic Source: Twitter)
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఒకప్పటి సహచర ఆటగాడు వినోద్ కాంబ్లి (Vinod Kambli) పని కోసం ఇప్పుడు ముంబయి క్రికెట్ అసోషియేషన్‌ని అభ్యర్థిస్తున్నాడు. సచిన్‌తో కలిసి స్కూల్ డేస్‌లోనే వరల్డ్‌ రికార్డ్ నెలకొల్పిన వినోద్ కాంబ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. భారత్ తరఫున ఆడిన మొదటి ఏడు టెస్టుల్లోనే 113.29 సగటుతో 793 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.
కానీ.. భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలోనే అతను వ్యసనాల బారినపడ్డాడు. అతిగా మద్యం సేవించడం, గొడవలు అతడ్ని భారత్ జట్టుకి క్రమంగా దూరం చేశాయి. 1993లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన వినోద్ కాంబ్లి 1995 తర్వాత మళ్లీ ఐదు రోజుల ఫార్మాట్‌లో ఆడలేకపోయాడు. అలానే 2000 తర్వాత వన్డేలకీ దూరమైపోయాడు. ఓవరాల్‌గా అతని కెరీర్‌ కేవలం 9 సంవత్సరాల్లోనే ముగిసింది. మరోవైపు అతని సహచర క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఏకంగా 24 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన విషయం తెలిసిందే.

కెరీర్‌లో 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లి రిటైర్మెంట్ తర్వాత క్రికెట్‌కి పూర్తిగా దూరమైపోయాడు. సాధారణంగా క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్, కోచ్ లేదా అకాడమీలని ఏర్పాటు చేసుకుని స్థిరపడిపోతుంటారు. కానీ వినోద్ కాంబ్లి మాత్రం బీసీసీఐ అందిస్తున్న పెన్షన్‌తో జీవనం సాగిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతనికి బీసీసీఐ రూ.30,000 పెన్షన్ ఇస్తోంది. అయితే ఇప్పుడు ఆ పెన్షన్ సరిపోవడం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన వినోద్ కాంబ్లి ముంబయి క్రికెట్ అసోషియేషన్‌‌ని పని కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఫ్యామిలీని చూసుకునేందుకు క్రికెట్‌ పరంగా కోచ్ లేదా ఏదైనా పనిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు 50 ఏళ్ల వినోద్ కాంబ్లి చెప్పుకొచ్చాడు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.