యాప్నగరం

సెల్ఫ్ క్వారంటైన్‌లో శ్రీలంక దిగ్గజ క్రికెటర్

కరోనా వైరస్ కట్టడిలో తనవంతు బాధ్యతగా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండనున్నట్లు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర వెల్లడించాడు. లంకలో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 80 దాటాయి.

Samayam Telugu 23 Mar 2020, 1:04 pm
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు స్వయంగా ప్రకటించాడు. ఇటీవల యూకే నుంచి వచ్చిన సంగక్కర.. శ్రీలంక ప్రభుత్వం ఇటీవల ఆదేశాల మేరకు 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండనున్నట్లు తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చిన వారు కనీసం రెండు వారాలు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని అన్ని దేశాల ప్రభుత్వాలు ఆదేశించిన విషయం తెలిసిందే.
Samayam Telugu Kumar Sangakkara


Read More: భారత్‌ని చూసి బుద్ధి తెచ్చుకోండి.. పాక్ ప్రజలపై అక్తర్ మండిపాటు

‘‘కరోనా వైరస్ లక్షణాలు నాకేమీ ప్రస్తుతం లేవు. కానీ.. శ్రీలంక ప్రభుత్వ ఆదేశాల్ని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే.. గత వారం లండన్ నుంచి వచ్చిన నేను.. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నాను’’ అని కుమార సంగక్కర వెల్లడించాడు. మార్చి 1 నుంచి 15లోపు విదేశాల నుంచి వచ్చిన వారు తప్పకుండా శ్రీలంక ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో రిజస్టర్ చేసుకోవాలని ఆదేశించి ఉండటంతో.. తాను కూడా ఆ యాప్‌లో పేరుని రిజస్టర్ చేసినట్లు కుమార సంగక్కర వెల్లడించాడు.

Read More: ఐసీసీ బెస్ట్ ‘ఫుల్‌ షాట్‌‌’ రేసులోకి కొత్త పేరు

శ్రీలంకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులో ఇప్పటికే 80కి చేరుకోగా.. సంగక్కర ఒకప్పటి సహచర క్రికెటర్ మహేల జయవర్దనె.. కరోనా వైరస్ వ్యాప్తిని దేశంలో అడ్డుకునేందుకు తనవంతుగా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జయవర్దనె వివరిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.