యాప్నగరం

​ ఇంజిమామ్‌కి రూ. కోటి ఎందుకు..?

గత ఏడాది క్రమశిక్షణ పేరుతో పాక్ జట్టులోని ప్రధాన క్రికెటర్లను సైతం ఇంజిమామ్ ఉల్ హక్ పక్కకిపెట్టేశాడు. గత ఏడాది

TNN 7 Jul 2017, 5:09 pm
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని ఓడించి తొలిసారి టైటిల్ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు‌కి ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రకటించిన నజరానా ఇప్పుడు తీవ్ర వివాదం రేపుతోంది. జట్టులోని ఒక్కో క్రికెటర్‌‌కి రూ. కోటి ప్రకటించిన షరీఫ్.. పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్‌కి కూడా అదే స్థాయిలో రివార్డు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతనితో పాటు సెలక్టర్లుగా ఉన్న మరో ముగ్గురు సభ్యులకి కేవలం రూ.10 లక్షలు మాత్రమే నజరానా అందజేయడం ఈ వివాదానికి ఆజ్యం పోస్తోంది.
Samayam Telugu fresh questions raised over inzamam ul haqs pkr 10 million cash award
​ ఇంజిమామ్‌కి రూ. కోటి ఎందుకు..?


గత ఏడాది క్రమశిక్షణ పేరుతో పాక్ జట్టులోని ప్రధాన క్రికెటర్లను సైతం ఇంజిమామ్ ఉల్ హక్ పక్కకిపెట్టేశాడు. గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లే ముందు మిలిటరీ తరహాలో ఆటగాళ్లకి కఠిన ఫిటెనెస్ సెషన్లు నిర్వహించి జట్టును తయారు చేశాడు. వివాదాలు చుట్టుముట్టినా.. మిక్కీ ఆర్థర్‌ని కోచ్‌గా ఎంపిక చేసి మెగా టోర్నీకి జట్టును సిద్ధం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఇంజిమామ్ చక్రం తిప్పే స్థాయికి ఎదిగిపోయాడు. ప్రధాన మంత్రి తొలుత ఆటగాళ్లకి రూ. కోటి, సెలక్టర్లు, సహాయ సిబ్బందికి తలో రూ. 10 లక్షలు ఇవ్వాలని భావించారట. కానీ.. మధ్యలో కొన్ని చర్చల తర్వాత ఇంజిమామ్‌కి భారీ స్థాయిలో రివార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.