యాప్నగరం

గౌతమ్ గంభీర్ టాలెంటెడ్.. కానీ ఓవర్ ఎమోషనల్: వెంగ్‌సర్కార్

మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమాత్రం కవ్వింపులకి దిగినా గౌతమ్ గంభీర్ వారిపైకి దూసుకెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో ఓసారి కమ్రాన్‌ అక్మల్‌ని.. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ‌ని దాదాపు కొట్టినంత పనిచేశాడు.

Samayam Telugu 23 May 2020, 8:48 pm
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టాలెంటెడ్.. కానీ ఎమోషన్స్‌ని అస్సలు కంట్రోల్ చేసుకోలేడని భారత మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ ఆడే రోజుల్లో మైదానంలోనే విరాట్ కోహ్లీతో గొడపడిన గౌతమ్ గంభీర్.. పాకిస్థాన్‌ క్రికెటర్లు అఫ్రిది, కమ్రాన్ అక్మల్‌తోనూ వాగ్వాదానికి దిగాడు. అలానే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపైనా తరచూ విమర్శలు గుప్పించాడు. దాంతో.. తన కెరీర్‌కి ముందే గంభీర్ వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu గౌతమ్ గంభీర్


2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో గౌతమ్ గంభీర్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి.. భారత్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లోనూ నిలకడగా రాణించిన గంభీర్.. టీమిండియా అగ్రశ్రేణి ఓపెనర్‌గా ఎదిగాడు. కానీ.. మైదానంలో ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేని తత్వం.. అతని కెరీర్‌ని దెబ్బతీసింది. భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లాడిన గంభీర్ 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

‘‘గౌతమ్ గంభీర్ చాలా ప్రతిభ ఉన్న క్రికెటర్. కానీ.. కోపాన్ని, ఎమోషన్స్‌ని అతను నియంత్రించుకోలేడు. ఒకవేళ తన యాటిట్యూడ్‌ని అతను మార్చుకుని ఉండింటే..? మరికొంతకాలం అతను టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడేవాడు’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.