యాప్నగరం

మలింగ గొడవ.. శ్రీలంక కోచ్‌పై వేటు

జట్టులోని ఆటగాళ్లకి క్రమశిక్షణ, ఫిటెనెస్ విషయంలో దక్షిణాఫ్రికాకి చెందిన గ్రాహమ్ ఉదాసీనతగా ఉంటున్నాడని

TNN 24 Jun 2017, 7:30 pm
ఇంగ్లాండ్‌లో ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో సెమీస్ అవకాశాన్ని చేజార్చుకున్న శ్రీలంక జట్టు ప్రక్షాళన ఆరంభమైంది. 2019 వన్డే ప్రపంచకప్ వరకు ఒప్పందం గడువు ఉన్నా.. అర్ధాంతరంగా ఆ జట్టు ప్రధాన కోచ్ గ్రాహమ్ ఫోర్డ్ బాధ్యతల నుంచి శనివారం తప్పుకున్నాడు. పాకిస్థాన్‌ చేతిలో ఓటమికి కారణం జట్టులోని క్రికెటర్లకి ఫిటెనెస్ లేకపోవడమేనని శ్రీలంక క్రీడల మంత్రి వారం క్రితం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఘాటుగా స్పందించిన ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ.. సదరు మంత్రిని కోతితో పోల్చడంతో వివాదం మొదలైంది.
Samayam Telugu graham ford steps down as sri lanka head coach
మలింగ గొడవ.. శ్రీలంక కోచ్‌పై వేటు


గత ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంక కోచ్‌గా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన గ్రాహమ్ మంచి ఫలితాలను రాబట్టాడు. ఆరంభంలోనే ఆస్ట్రేలియాను టెస్టుల్లో శ్రీలంక క్లీన్‌స్వీప్ చేయగలిగింది. అయితే జట్టులోని ఆటగాళ్లకి క్రమశిక్షణ, ఫిటెనెస్ విషయంలో దక్షిణాఫ్రికాకి చెందిన గ్రాహమ్ ఉదాసీనతగా ఉంటున్నాడని ఫిర్యాదు. తాజాగా మంత్రి కూడా ఈ విషయమయ్యే సీరియస్ అవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది. బోర్డుతో మాట్లాడిన తర్వాతే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2012 నుంచి 2014 వరకు గ్రాహమ్ లంక కోచ్‌గా పనిచేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.