యాప్నగరం

హ్యాపీ బర్త్‌డే సెహ్వాగ్.. కింగ్ ఆఫ్ ట్విట్టర్!

వీరబాదుడికి కేరాఫ్ అడ్రస్ వీరేంద్ర సెహ్వాగ్. టెస్ట్, వన్డే, టీ20.. ఫార్మాట్ ఏదైనా సెహ్వాగ్ ట్రీట్‌మెంట్‌లో మాత్రం తేడా ఉండదు.

TNN 20 Oct 2017, 11:04 am
వీరబాదుడికి కేరాఫ్ అడ్రస్ వీరేంద్ర సెహ్వాగ్. టెస్ట్, వన్డే, టీ20.. ఫార్మాట్ ఏదైనా సెహ్వాగ్ ట్రీట్‌మెంట్‌లో మాత్రం తేడా ఉండదు. భారత డాషింగ్ ఓపెనర్‌గా పేరుతెచ్చుకోవడమే కాకుండా.. ప్రపంచంలోనే దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన వీరేంద్రుడి పుట్టినరోజు నేడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నప్పటికీ కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా భారత క్రికెట్ అభిమానులకు సెహ్వాగ్ దగ్గరగానే ఉన్నాడు. ఇక సెహ్వాగ్ సెన్సాస్ ఆఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటకు గుడ్‌బై చెప్పినప్పటి నుంచి ట్విట్టర్‌లో సెహ్వాగ్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన చమత్కార ట్వీట్లతో అందరినీ ఆకర్షిస్తున్న సెహ్వాగ్.. కింగ్ ఆఫ్ ట్విట్టర్‌గా వెలిగిపోతున్నాడు.
Samayam Telugu happy birthday virender sehwag game changer icon and king of twitter
హ్యాపీ బర్త్‌డే సెహ్వాగ్.. కింగ్ ఆఫ్ ట్విట్టర్!


టెస్ట్ రూపాన్ని మార్చేసిన ఘనుడు..
ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ బ్యాట్స్‌మెన్ అంటే.. గంటల తరబడి క్రీజులో ఉండాలి. కొన్ని వందల బంతులు ఆడాలి. ఓపికగా పరుగులు రాబట్టాలి. సునీల్ గవాస్కర్, గ్రాహం గూచ్, జెఫ్రే బాయ్‌కాట్ వంటి దిగ్గజ ఓపెనర్లు చేసింది అదే. ఆఖరికి వన్డేల్లో భీకర బ్యాట్స్‌మెన్‌గా పేరుతెచ్చుకున్న సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, హర్షెల్లే గిబ్స్ వంటి వారు కూడా టెస్టులకు వచ్చేసరికి చాలా నెమ్మదిగా ఆడేవారు. కానీ వీరేంద్రుడి రాకతో దాని స్వరూపం మారిపోయింది. టెస్ట్ మ్యాచ్‌ ఆరంభం కూడా పొట్టి ఫార్మాట్‌లానే ఉండేది. అందుకే ఏ భారత బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీని బాదేశాడు. అదీ ఒకసారి కాదు.. రెండుసార్లు.

2004లో పాకిస్థాన్ మీద 309 పరుగులు చేసిన సెహ్వాగ్.. 2008లో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. మొత్తం 104 టెస్టు మ్యాచుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు సాధించాడు. వీటిలో 23 సెంచరీలు ఉన్నాయి. ఇక 251 వన్డేలు ఆడిన సెహ్వాగ్.. 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. 15 సెంచరీలు బాదాడు. వన్డేల్లో భారత్ తరఫున డబుల్ సెంచరీ నమోదుచేసిన తొలి బ్యాట్స్‌మన్ కూడా సెహ్వాగ్ కావడం విశేషం. అందుకే ఈ డాషింగ్ ఓపెనర్ అంటే భారత క్రికెట్ అభిమానులు పడిచస్తారు. ఇప్పటికీ సెహ్వాగ్ ఆడిన పాత మ్యాచ్‌ల హైలైట్స్ టీవీల్లో వస్తే చాలా మంది అభిమానులు కన్నార్పకుండా చూస్తారనడంలో అతిశయోక్తి కాదు. మరి నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న సెహ్వాగ్‌కి శుభాకాంక్షలు చెప్పేద్దామా..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.