యాప్నగరం

చిన్నారి చికిత్సకు హర్భజన్ సాయం

భారత ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు.

TNN 29 Oct 2017, 1:55 pm
భారత ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్సకు అవసరమైన ఖర్చును భరించాడు. కావ్య అనే 4 ఏళ్ల చిన్నారి మెదడు వాపు వ్యాధికి చికిత్స పొందుతున్న విషయం ‘ఖల్సా ఎయిడ్’ ద్వారా భజ్జీ దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఆ పాప చికిత్స కోసం 4600 డాలర్లు విరాళంగా ఇచ్చామని ఆ సంస్థ చెప్పింది.
Samayam Telugu harbhajan singh supports the medical treatment of four year old girl suffering from encephalitis
చిన్నారి చికిత్సకు హర్భజన్ సాయం


Kavya is our daughter.. waheguru will protect her..we r just doing our duty..satnam waheguru 🙏🙏🙏.. https://t.co/R9fWR66oTc — Harbhajan Turbanator (@harbhajan_singh) October 25, 2017
పాప ఆరోగ్య పరిస్థితి చూసి చలించిపోయిన హార్భజన్ వెంటనే స్పందించాడు. నేను ఆ చిన్నారికి ఏ విధంగానైనా సాయం చేయగలనేమో చెప్పండి. తన చికిత్సకు అయ్యే మొత్తాన్ని నేనే చెల్లిస్తా, వివరాలు పంపండి అని ట్వీట్ చేశాడు. రెండ్రోజుల తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి పాపను పరామర్శించిన భజ్జీ.. చికిత్సకు అవసరమైన మొత్తాన్ని కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఖల్సా ఎయిడ్ కూడా ధ్రువీకరించింది. కావ్య మన బిడ్డ. వాహే గురు తనని కాపాడతాడు. మనం మన బాధ్యత మాత్రమే నిర్వర్తిస్తున్నాం అని భజ్జీ ట్వీట్ చేశాడు.

Cricketing legend @harbhajan_singh joined our team & visited 4 yr old Kavya in hospital today,he donated generously towards her treatment pic.twitter.com/3RQ12d3h3D — Khalsa Aid (@Khalsa_Aid) October 25, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.