యాప్నగరం

పాండ్య సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వైరల్

దక్షిణాఫ్రికాతో మంగళవారం రాత్రి జరిగిన ఐదో వన్డేలో భారత్ నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పట్టిన సింగిల్ హ్యాండ్ క్యాచ్

TNN 14 Feb 2018, 6:58 pm
దక్షిణాఫ్రికాతో మంగళవారం రాత్రి జరిగిన ఐదో వన్డేలో భారత్ నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పట్టిన సింగిల్ హ్యాండ్ క్యాచ్ వీడియో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 42వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శంసీ బంతిని సిక్స్‌గా స్టాండ్స్‌లోకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఎక్కువగా గాల్లోకి లేచిన బంతి.. బౌండరీ లైన్‌కి సమీపంలో హార్దిక్ పాండ్య చేతికి చిక్కింది. లాంగాఫ్ నుంచి లాంగాన్‌లోకి పరుగెత్తుకుంటూ వచ్చిన పాండ్య.. ఒంటిచేత్తో ఎలాంటి తడబాటు లేకుండానే బంతిని చక్కగా అందుకుని ఆశ్చర్యపరిచాడు.
Samayam Telugu hardik pandya makes a one handed stunner look as easy as it gets
పాండ్య సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వైరల్


ప్లైటెడ్ డెలివరీ రూపంలో బంతిని కుల్దీప్ యాదవ్ విసరగా.. క్రీజులో నుంచి పాదాల్ని కదిలిస్తూ వెలుపలికి వచ్చిన శంసీ హిట్ చేశాడు. దీంతో.. గాల్లోకి లేచిన బంతిని లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ శిఖర్ ధావన్ అందుకుంటాడని అంతా భావించారు. కానీ.. టైమింగ్ ఎక్కువగా రావడంతో.. వేగంగా లాంగాఫ్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్య సింగిల్ హ్యాండ్‌తో అందుకున్నాడు. అతని వెనుకే క్యాచ్ కోసం ప్రయత్నిస్తున్న ధావన్ నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pandya does it again pic.twitter.com/LE9Zf3zXsJ — Cricket Videos (@cricvideos11) February 13, 2018
Click here for Video: https://twitter.com/cricvideos11/status/963482362280464385

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ (115: 126 బంతుల్లో 11x4, 4x6) శతకం బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో ఆరు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1తో చేజిక్కించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.