యాప్నగరం

హార్దిక్ నుంచి మరీ ఎక్కువగా ఆశించకండి..!

భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి అభిమానులు మరీ ఎక్కువగా ఆశిస్తున్నారని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్

TNN 2 Mar 2018, 10:36 am
భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి అభిమానులు మరీ ఎక్కువగా ఆశిస్తున్నారని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో హర్దిక్ పాండ్య ఒక్క మ్యాచ్‌లో మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ.. 93 పరుగులతో భారత్‌ పరువు నిలిపిన ఈ యువ ఆల్‌రౌండర్.. ఆ తర్వాత రెండు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల్లో కనీసం ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేకపోయాడు. దీంతో.. అతనిపై విమర్శలు వస్తుండటంతో.. కపిల్‌దేవ్ స్పందించారు.
Samayam Telugu hardik pandya needs to improve his batting kapil dev
హార్దిక్ నుంచి మరీ ఎక్కువగా ఆశించకండి..!


‘హర్దిక్ పాండ్య ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. కానీ.. అతని నుంచి మనం మరీ ఎక్కువగా ఆశిస్తున్నాం. హార్దిక్‌లో మంచి నైపుణ్యమున్న క్రికెటర్‌గా ఎదిగే సామర్థ్యం పుష్కలంగా ఉంది. అయితే.. అతను బ్యాటింగ్‌పై ఇంకొంచెం దృష్టి సారించాలి. ఎందుకంటే.. ఇప్పుడు అతడ్ని టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గానే చూస్తోంది. బ్యాట్‌తో పరుగులు రాబట్టగలిగినప్పుడు ఆటోమేటిక్‌గా బౌలింగ్‌లోనూ ఆ ఉత్సాహం కనిపిస్తుంది. ఒత్తిడిలోనూ స్వేచ్ఛగా ఆడే నైజం హార్దిక్‌లో నాకు బాగా నచ్చుతుంది’ అని కపిల్‌దేవ్ ప్రశంసించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.