యాప్నగరం

హార్దిక్ ఆల్‌రౌండర్ కాదు: హర్భజన్

ఇంగ్లాండ్ గడ్డ మీద భారత జట్టు వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై హర్భజన్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Samayam Telugu 16 Aug 2018, 4:18 pm
ఇంగ్లాండ్ చేతిలో తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన భారత జట్టుపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. లార్డ్స్ టెస్టులో ఇన్నింగ్స్ 159 పరుగుల భారీ తేడాతో ఓడటం ఎవరికీ రుచించడం లేదు. మాజీ దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌తో పోలుస్తున్నప్పటికీ.. హార్దిక్ పాండ్య అసలు ఆల్‌రౌండరే కాదని హర్భజన్ సింగ్ ఎద్దేవా చేశాడు. హార్దిక్ నుంచి ఆల్‌రౌండర్ ట్యాగ్ తొలగించాలని అతడితో కలిసి ఐపీఎల్ ఆడిన భజ్జీ తెలిపాడు.
Samayam Telugu hardik


‘‘హార్దిక్ బ్యాట్స్‌మెన్‌గా ఎక్కువ పరుగులేం చేయలేదు. అతడి బౌలింగ్ పట్ల కెప్టెన్‌కు నమ్మకం ఉన్నట్టు కనిపించడం లేదు. ఇంగ్లాండ్‌లో ఉన్న పరిస్థితుల్లో అతడు బౌలింగ్ చేయకపోతే.. అది అతడికి, భారత క్రికెట్ జట్టు భవిష్యత్తుకి ఇబ్బంద’’ని భజ్జీ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

‘‘ఇంగ్లిష్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్‌లతో పోలిస్తే.. పాండ్య చాలా వెనుకబడి ఉన్నాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఆల్‌రౌండర్ అంటే స్టోక్స్, కర్రాన్ తొలి టెస్టులో ఎలా ఆడారో.. లార్డ్స్‌లో వోక్స్ ఎలా ఆడాడో.. అలా ఆడాలి. హార్దిక్ నుంచి కూడా అదే ఆశించాం. అతడు ఓవర్‌నైట్‌లో కపిల్ దేవ్ కాలేడు. అతడికి ఉన్న ఆల్‌రౌండర్ ట్యాగ్ తొలగించాల’’ని భజ్జీ సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.