యాప్నగరం

ధోనీలా మ్యాచ్‌లను నేనూ ఫినిష్ చేస్తా..!

జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు హిట్టింగ్ చేయాలంటే తెగింపు ఉండాలి. బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు తొలుత స్కోరు బోర్డును నిశితంగా

TNN 5 Jul 2017, 4:02 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీలా మ్యాచ్‌లను తాను ఫినిష్ చేయాలని ఆశిస్తున్నట్లు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు. వెస్టిండీస్‌తో గురువారం ఐదో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో హార్దిక్ పాండ్య మాట్లాడాడు. గత ఆదివారం ముగిసిన నాలుగో వన్డేలో కీలక సమయంలో వికెట్లను చేజార్చుకున్న భారత్ 11 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరీస్‌‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్నా.. చివరి వన్డేలో గెలిచి సిరీస్‌ని సమం చేయాలని కరీబియన్లు భావిస్తుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా జరగనుంది.
Samayam Telugu hardik pandya ready to take finishing responsibility
ధోనీలా మ్యాచ్‌లను నేనూ ఫినిష్ చేస్తా..!


‘జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు హిట్టింగ్ చేయాలంటే తెగింపు ఉండాలి. బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు తొలుత స్కోరు బోర్డును నిశితంగా పరిశీలిస్తాను. ఒక విధ్వంసక ఆటగాడిగా నాకు నేను ఎప్పుడూ భావించను. మ్యాచ్ గమనానికి అనుగుణంగా దూకుడు పెంచుతూ రన్‌రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఈ టెక్నిక్ ధోనీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. కచ్చితంగా మ్యాచ్‌ ఫినిషర్‌గా మారి.. ధోనీలా మ్యాచ్‌లను ముగిస్తా’ అని హార్దిక్ పాండ్య ధీమా వ్యక్తం చేశాడు. మునుపటిలా మ్యాచ్‌లను ముగించడంలో ధోనీ విఫలమవుతుండటంతో సర్వత్రా విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.