యాప్నగరం

4,4,6,6,6,0తో పాండ్య ‘నెం.1’ రికార్డు..!

శ్రీలంకతో పల్లెకలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో వేగవంతమైన శతకం బాదిన హిట్టర్ హార్దిక్ పాండ్య భారత్ తరఫున

TNN 13 Aug 2017, 3:51 pm
శ్రీలంకతో పల్లెకలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో వేగవంతమైన శతకం బాదిన హిట్టర్ హార్దిక్ పాండ్య భారత్ తరఫున అరుదైన రికార్డు నెలకొల్పాడు. 23 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ టెస్టులో ఒకే ఓవర్‌లో కపిల్‌దేవ్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి 24 పరుగులు రాబట్టాడు. తాజాగా పల్లెకలె టెస్టులో శ్రీలంక స్పిన్నర్ పుష్పకుమార బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య వరుసగా 4, 4, 6 ,6 ,6 బాది 26 పరుగులతో ఆ రికార్డుని బద్దలుకొట్టాడు. భారత్ 322/6తో ఉండగా జట్టు స్కోరు బాధ్యతలు తీసు హార్దిక్ పాండ్య (108: 96 బంతుల్లో 8x4, 7x6) చివరి వికెట్‌గా 487 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
Samayam Telugu hardik pandya slams new record for india
4,4,6,6,6,0తో పాండ్య ‘నెం.1’ రికార్డు..!


టెస్టు చరిత్రలో ఒకే ఓవర్‌లో 28 పరుగులు బాదిన క్రికెటర్‌గా వెస్టిండీస్ దిగ్గజ హిట్టర్ బ్రియాన్ లారా (4,6,6,4,4,4) అగ్రస్థానంలో ఉన్నాడు. 2003-2004 టెస్టు సీజన్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ బౌలింగ్‌లో లారా హిట్టింగ్‌తో చెలరేగిపోయాడు. ఈ జాబితా టాప్-10లో హార్దిక్ పాండ్య ఒక్కడే భారత్ తరపున ఉండటం విశేషం. తొలి రెండు ఫోర్లు బాదిన అనంతరం.. క్రీజు వెలుపలకి వస్తూ హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన పాండ్య.. చివరి బంతిని హిట్టింగ్ చేయలేకపోవడంతో అరుదైన నెం.1 రికార్డు ముంగిట ఆగిపోయాడు. ఒకవేళ చివరి బంతి సిక్స్‌గా వెళ్లుంటే 30 పరుగులతో అన్ని రికార్డులు బద్దలైపోయేవి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.