యాప్నగరం

హార్దిక్ సహనం పాటిస్తే.. సఫారీలకి తిప్పలే

యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చేరికతోనే భారత జట్టులో సమతూకం వచ్చిందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్ అభిప్రాయపడ్డాడు.

TNN 7 Dec 2022, 4:35 pm
యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చేరికతోనే భారత జట్టులో సమతూకం వచ్చిందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్ అభిప్రాయపడ్డాడు. కేప్ టౌన్ వేదికగా శుక్రవారం నుంచి భారత్ జట్టు తొలి టెస్టులో దక్షిణాఫ్రికాతో ఢీకొట్టనుంది. ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్య కీలక ఆటగాడని.. భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి‌కి తుది జట్టు ఎంపికలో బ్యాట్స్‌మెన్/ ఫాస్ట్ బౌలర్‌గా అతను అదనపు ఆప్షన్ అవుతాడని వివరించారు. గత ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా మెరుపు శతకం, అర్ధ శతకంతో హార్దిక్ రాణించిన విషయం తెలిసిందే.
Samayam Telugu Hardik Pandya


‘భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య సమతూకం తెచ్చాడు. అతనిలో చాలా నైపుణ్యం ఉంది. మీడియం పేస్ బౌలింగ్ చేయగలడు, లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో పరుగులూ రాబట్టగలడు. తుది జట్టు ఎంపికలో హార్దిక్ పాండ్య ఒక పేసర్/బ్యాట్స్‌మెన్‌గా కెప్టెన్ కోహ్లికి అదనంగా ఒకరిని జట్టులోకి ఎంచుకునే వెసులబాటు కల్పిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఈ హిట్టర్‌ని నిలువరించడానికి షార్ట్ పిచ్‌ బంతులు వేస్తారని నేను అనుకుంటున్నా. కానీ.. అప్పుడు హార్దిక్ కొంచెం సహనం పాటిస్తే.. సఫారీ బౌలర్లకి తర్వాత తిప్పలు తప్పవు’ అని క్లూసెనర్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.