యాప్నగరం

మానవత్వాన్ని చాటుకున్న హార్దిక్ పాండ్య..!

ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టులో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విఫలమైనా.. మానవత్వంతో అందరి మనసులు గెలుచుకున్నాడు.

Samayam Telugu 6 Aug 2018, 9:51 pm
ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టులో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విఫలమైనా.. మానవత్వంతో అందరి మనసులు గెలుచుకున్నాడు. బర్మింగ్‌హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో కలిసి హోటల్‌కి వెళ్లిన హార్దిక్ పాండ్య తనతో పాటు ఓ కవర్‌ని లోపలికి తీసుకెళ్లాడు. మిగిలిన ఇద్దరు క్రికెటర్లు వేగంగా తమ గదికి వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్య మాత్రం ఆ కవర్‌ని నేరుగా తీసుకెళ్లి హోటల్ సిబ్బందికి అందజేశాడు.
Samayam Telugu ..


‘ఈ కవర్‌లో ఒకరికి సరిపడ భోజనం ఉంది. మేము డిన్నర్ చేసేటప్పుడు ఈ కవర్‌‌ని అస్సలు తాకలేదు. ఎవరైనా.. ఆకలితో భోజనం కోసం మీ హోటల్‌ దగ్గరికి వస్తే ఈ కవర్‌ని అందజేయండి’ అని సిబ్బందికి సూచించాడు. ఇంగ్లాండ్‌లో రాత్రి పూట భోజనం కోసం హోటల్‌ దగ్గరికి వ్యక్తులు రావడాన్ని గమనించే హార్దిక్ అలా కవర్‌ని సిబ్బందికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో.. ఈ ఆల్‌రౌండర్‌ గొప్ప మనసుని అందరూ ప్రశంసిస్తున్నారు. రెండో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.