యాప్నగరం

Asia Cup ముంగిట భారత్‌కి ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్‌కి గాయం

Harshal Patel Injury: ఆసియా కప్‌కి భారత్ జట్టుని సోమవారం సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. కానీ.. గాయం కారణంగా ఈ సెలెక్షన్‌కి హర్షల్ పటేల్ దూరంగా ఉండనున్నాడు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 7 Aug 2022, 5:41 pm

ప్రధానాంశాలు:

  • ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ స్టార్ట్
  • భారత్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే పాక్‌తో ఢీ
  • సెప్టెంబరు 11న ఆసియా కప్ ఫైనల్
  • అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్‌కప్ స్టార్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Harshal Patel Injury (Pic Source: Twitter)
హర్షల్ పటేల్‌కి గాయం (Pic Source: Twitter)
యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియా కప్‌ ప్రారంభంకానుండగా.. భారత్ జట్టు తన ఫస్ట్ మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. కానీ.. టోర్నీ ముంగిట భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా కితాబులు అందుకుంటున్న ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్‌కి తాజాగా గాయమైంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతున్న హర్షల్ పటేల్.. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20కి గాయం కారణంగా దూరంగా ఉండిపోయాడు. ఈరోజు జరగనున్న ఐదో టీ20 సెలెక్షన్‌కీ అతను అందుబాటులో లేడు.
నాలుగో టీ20 కోసం ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేస్తుండగా.. హర్షల్ పటేల్‌ పక్కటెముకలకి గాయమైంది. దాంతో.. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకూ జరగనున్న ఆసియా కప్‌‌కి దూరమవడం లాంఛనంగానే కనిపిస్తోంది. అలానే ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకూ జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లోనూ అతను ఆడటం సందేహమే!

2021, నవంబరులో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్.. ఇప్పటి వరకూ 17 మ్యాచ్‌లాడి 23 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4/25. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాల్ని విడదీయడంలో దిట్టగా పేరొందిన హర్షల్ పటేల్.. ఆసియా కప్‌ కప్‌కి దూరమవడం భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.