యాప్నగరం

కోహ్లి నెం.1 రికార్డు‌ని చెరిపేసిన ఆమ్లా..!

ఫార్మాట్ ఏదైనా.. వేగంతో పాటు నిలకడగా పరుగులు రాబట్టడం ఆమ్లా స్టైల్. అందుకే ఈ ఓపెనర్‌ని దక్షిణాఫ్రికా పరుగుల

TNN 29 May 2017, 9:03 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వేగవంతమైన 7వేల పరుగుల రికార్డును దక్షిణాఫ్రికా ఓపెనర్ హసీమ్ ఆమ్లా సోమవారం చెరిపేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆమ్లా (55: 54 బంతుల్లో 11x4) అర్ధశతకం బాది వన్డేల్లో వేగంగా 7వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి ఈ రికార్డును 161 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. ఆమ్లా 150వ ఇన్నింగ్స్‌లో చేరుకోవడం విశేషం.
Samayam Telugu hashim amla breaks virat kohlis batting record
కోహ్లి నెం.1 రికార్డు‌ని చెరిపేసిన ఆమ్లా..!


ఫార్మాట్ ఏదైనా.. వేగంతో పాటు నిలకడగా పరుగులు రాబట్టడం ఆమ్లా స్టైల్. అందుకే ఈ ఓపెనర్‌ని దక్షిణాఫ్రికా పరుగుల యంత్రం అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పటి వరకు కెరీర్‌లో 153 వన్డేలాడిన ఆమ్లా.. 24 శతకాలు, 32 అర్ధశతకాలు చేశాడు. అతని సగటు 50.19కాగా.. స్ట్రైక్ రేట్ 89.15 ఉండటం కొసమెరుపు.

వన్డేల్లో వేగంగా 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ల టాప్ -5 జాబితాను ఓ సారి పరిశీలిస్తే.. ఆమ్లా (150వ ఇన్నింగ్స్), విరాట్ కోహ్లి (161), డివిలియర్స్ (166), గంగూలీ (174), బ్రియాన్ లారా (183).

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.