యాప్నగరం

వన్డేలకి ఆసీస్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

భారత్‌‌తో టీ20 సిరీస్‌కి సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకి షాకింగ్ న్యూస్. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్‌ వన్డేల‌కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ

TNN 6 Oct 2017, 12:44 pm
భారత్‌‌తో టీ20 సిరీస్‌కి సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకి షాకింగ్ న్యూస్. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్‌ వన్డేల‌కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. గత కొంతకాలంగా వరుస గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ 31 ఏళ్ల ఫాస్ట్‌ బౌలర్ వన్డేలు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌‌కి వీడ్కోలు పలుకుతూ టీ20ల్లో మాత్రమే ఆడనున్నట్లు ప్రకటించాడు. శనివారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియా జట్టు తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌తో తలపడనుంది. ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని ఆసీస్ 1-4‌ తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu hastings announces retirement from first class and one day cricket
వన్డేలకి ఆసీస్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్


‘భుజానికి నాలుగు సార్లు గాయాలయ్యాయి.. మోకాలికి కూడా నాలుగు సార్లు ఆపరేషన్ చేశారు. ఇన్ని గాయాలైనా.. పట్టుదలతో మళ్లీ తిరిగి మైదానంలోకి రాగలిగాను. కానీ.. వన్డే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌‌ మ్యాచ్‌‌ల్లో పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేసే సామర్థం ప్రస్తుతం నా శరీరానికి లేదు. అందుకే ఆ ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇది చాలా కఠినమైన నిర్ణయమని నాకు తెలుసు. కానీ.. ఆ ఫార్మాట్లకి దూరంగా ఉంటే తప్ప టీ20ల్లో మెరుగ్గా రాణించలేనని నాకు అర్థమైంది’ అని హేస్టింగ్స్‌ వివరించాడు. గత ఏడాది 15 వన్డేలాడిన హేస్టింగ్స్‌.. 29 వికెట్లు పడగొట్టి 2016లో ఎక్కువ వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.