యాప్నగరం

India's Lowest ODI Scores: 9 ఏళ్ల తర్వాత మళ్లీ చెత్త రికార్డ్‌లోకి భారత్..!

2010 తర్వాత భారత్ జట్టు 100 పరుగులలోపే వన్డేలో కుప్పకూలడం ఇదే తొలిసారికాగా.. అప్పుడు కూడా న్యూజిలాండ్ చేతిలోనే ఈ అవమానం ఎదురైంది.

Samayam Telugu 31 Jan 2019, 10:43 am
న్యూజిలాండ్ గడ్డపై హ్యాట్రిక్ విజయాలతో జోరుమీద కనిపించిన భారత్ జట్టు గురువారం ఒక్కసారిగా తడబడి చెత్త రికార్డ్‌ని మూటగట్టుకుంది. హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఈరోజు జరిగిన నాలుగో వన్డేలో ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) ధాటికి ఏమాత్రం క్రీజులో నిలవలేకపోయిన భారత్ జట్టు 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది. ఎంతలా అంటే టీమ్‌లో ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ డకౌట్‌ రూపంలో వెనుదిరిగారు. మణికట్టు స్పిన్నర్ చాహల్ (18 నాటౌట్: 37 బంతుల్లో 3x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Samayam Telugu eight_col_190131BlackCapsvIndia_18


2010 తర్వాత భారత్ జట్టు 100 పరుగులలోపే వన్డేలో కుప్పకూలడం ఇదే తొలిసారికాగా.. అప్పుడు కూడా న్యూజిలాండ్ చేతిలోనే ఈ అవమానం ఎదురైంది. సుదీర్ఘ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు తక్కువ స్కోరుకి ఆలౌటైన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే..!

1. శ్రీలంకతో 2000లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 54 పరుగులకే ఆలౌటైంది.

2. ఆస్ట్రేలియాతో 1981లో సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో 63కే ఆలౌటైంది.

3. శ్రీలంకతో 1986లో కాన్పు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 78కి కుప్పకూలింది.

4. పాకిస్థాన్‌తో 1978లో సైల్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 79కి ఆలౌట్

5. న్యూజిలాండ్‌తో 2010లో దంబుల్లా వేదికగా జరిగిన వన్డేలో 88 పరుగులకి ఆలౌట్

6. దక్షిణాఫ్రికాతో 2006లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 91కి ఆలౌట్

7. ఆస్ట్రేలియాతో 2000లో సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో 100 పరుగులకి ఆలౌట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.