యాప్నగరం

భారత క్రికెటర్లకి హిందీ తప్పనిసరిపై వివాదం

రంజీ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించిన సుశీల్ దోషి వివాదాస్పద రీతిలో.. భారతీయులందరికీ హిందీ మాతృ భాష అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా.. క్రికెటర్లు హిందీలోనే మాట్లాడాలని సూచించాడు.

Samayam Telugu 13 Feb 2020, 7:18 pm
భారత క్రికెటర్లకి హిందీ తప్పనిసరిగా తెలుసుండాలని మ్యాచ్ కామెంటేటర్లు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దేశవాళీ క్రికెట్‌.. రంజీ ట్రోఫీలో భాగంగా కర్నాటక, బరోడా టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన సుశీల్ దోసీ.. వివాదాస్పద రీతిలో హిందీ అందరికీ మాతృ భాష అని వ్యాఖ్యానించాడు. దీంతో.. అతనిపై సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
Samayam Telugu Kolkata: Andhra batsman C R Gnaneswar plays a shot during the Ranji Trophy match...


Read More: undefined

మ్యాచ్‌లో కర్నాటక ఆటగాళ్లు కన్నడలో మాట్లాడుకుంటుండగా.. అప్పుడు కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సుశీల్ ‘ప్రతి భారతీయుడికి హిందీ తప్పనిసరిగా తెలుసుండాలి. ఎందుకంటే హిందీ మన మాతృ భాష. దేశంలో ఈ భాష కంటే ఏ భాషా పెద్దది కాదు. హిందీలో మాట్లాడుకోకుండా క్రికెటర్లమని చెప్పుకునేవారిని చూస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే..? మనం భారత్‌లో ఉన్నాం.. కాబట్టి.. మన మాతృ భాష (హిందీ)లోనే మాట్లాడుకోవాలి’ అని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించాడు.

Read More: భారత టీ20 కెప్టెన్‌ని మారిస్తే బెటర్: డయానా
వాస్తవానికి భారత క్రికెటర్లు.. మ్యాచ్ సమయంలో తరచూ ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఒకే రాష్ట్రం లేదా భాషకి చెందిన క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తుంటే..? వారు తమ మాతృ భాషలో సంభాషించుకోవడం కనిపిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన ఆఖరి వన్డేలో కేఎల్ రాహుల్, మనీశ్ పాండే.. కన్నడలో మాట్లాడుకోవడం స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.